ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్న ఒకే ఒక్క అవకాశం అమరావతి. ఆ వివాదాన్ని అడ్డుపెట్టుకునే ఆయన జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకుంటున్నారు. జగన్ స్వార్థంతో అమరావతిని చంపేయాలని అనుకుంటున్నారని, కలల రాజధానిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. అయితే ఈ పిలుపును అమరావతికి భూములిచ్చిన రైతులు మినహా మిగతా ఎవ్వరూ అందుకోవట్లేదు. రాష్ట్ర ప్రజల్లో అమరావతినే రాజధానిగా ఉంచాలనే బలమైన కోరిక ఏమీ లేదు. ఇందుకు కారణం చంద్రబాబు గత ఐదేళ్ళలో చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం. మొదట్లో ఆయన చేతిలో ఇడ్లీ పాత్రలను పోలిన నమూలాను చూసి ఇలాగే ఉండబోతున్నాయా నిర్మాణాలు అంటూ ఆశ్చర్యపోయిన జనం కొన్నాళ్ళకు అవి గ్రాఫిక్స్ వరకే పరిమితమని తెలుసుకుని లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు.
అదే ఇప్పుడు చంద్రబాబు అమరావతిని కాపాడుకుందాం రండి అంటున్నా ఎవ్వరూ రావట్లేదు. కృష్ణ, గుంటూరు జిల్లాల జనం కాస్తో కూస్తో అమరావతి మీద ఆసక్తి ఉంది తప్ప మిగతా జనంలో అదేమీ లేదు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో. అమరావతిని కాదని జగన్ ప్రతిపాదించిన రాజధానుల్లో విశాఖ ప్రధానమైనది. అక్కడే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉండనుంది. అందుకే అక్కడి జనం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎవరైనా తమ జిల్లా రాజధాని కాబోతోంది అంటే అడ్డుపడరు కదా. ఒకవేళ ఎవరైనా అడ్డం చెప్పినా ఒప్పుకోరు. కానీ చంద్రబాబు నాయుడు విశాఖ టీడీపీ లీడర్లను అమరావతిని అనుకూలంగా విశాఖలో ఆందోళన చేయమని చెబుతున్నారట.
అలా చేస్తే అక్కడి జనం చూస్తూ ఊరుకుంటారా అనేది లోకల్ లీడర్ల భాధ. ఒక ప్రాంతానికి లబ్ది చేకూరకూడదని ఆ ప్రాంతంలోనే ఉండి డిమాండ్ చేస్తే ఆ ప్రాంతం జనం తప్పకుండా వ్యతిరేకిస్తారు. అయినా సరే చంద్రబాబు విశాఖ వీధుల్లో జై అమరావతి, సేవ్ అమరావతి అంటూ తిరగమని నేతలకు చెబుతున్నారట. ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టని వీడారు. ఇక జ్యుడీషియల్ క్యాపిటల్ కానున్న కర్నూలు జిల్లాలో కూడ అదే పరిస్థితి. జలాలను రాజధానిగా చూడాలని కర్నూలు వాసులకు దశాబ్దాల తరబడి కల ఉంది. అదిప్పుడు నెరవేరనుంది. ఆ కలకు అడ్డుపడితే వాళ్ళు ఊరుకుంటారా. అందుకే కర్నూల్ జిల్లా టీడీపీ నేతలు సైతం బాబు చేయమనం పనిలో అర్థం ఉందా అంటూ మౌనం పాటిస్తున్నారు.