రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడే తెలంగాణలో టీడీపీ పార్టీ భూస్థాపిం అయ్యింది. అయితే రానున్న రోజుల్లో ఏపీలో కూడా టీడీపీ పార్టీ భూస్థాపితం కానుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఇలా అంటుంటే టీడీపీ నాయకులు మాత్రం జమిలి ఎన్నికలు వస్తున్నాయని, వాటిలో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జమిలి ఎన్నికలు టీడీపీకి అధికారం ఇస్తాయా?
జమిలి ఎన్నికలు అంటే లోకసభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. అధికారం మీద మోజు తీరని చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు వస్తాయని అందులో టీడీపీ విజయం సాధిస్తుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు స్పందిస్తూ జమిలి ఎన్నికలంటూ వస్తే టీడీపీ ఈసారి సున్నా సీట్లు రావడం ఖాయమని ఎద్దేవా చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసి కూడా చంద్రబాబు నాయుడు ఏ ధీమాతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
జమిలి ఎన్నికల్లో వైసీపీ కూడా కష్టమేనా!
జమిలి ఎన్నికలంటూ వస్తే వైసీపీకి కూడా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారాయి. అలాగే మూడు రాజధానుల అంశం వల్ల ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెరిగేలా చేసింది. అలాగే వైసీపీ కక్ష్యపూరిత రాజకీయాల వల్ల కూడా వైసీపీకి కష్టాలు తప్పేలా లేవు.