టీడీపీ నేతలపై వరుసగా అరెస్ట్ ల పర్వం కొనసాగుతోన్న సంగతి తెలిసింది. అవినీతి, అక్రమాల కేసుల్లో అడ్డంగా దొరికి జైలు పాలవుతున్నారు. ఈ ఎస్ ఐ స్కామ్ లో పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విజయవాడ జైలులో ఉండగా, జేసీ ప్రభాక్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు కడపజైలులో ఉన్నారు. శనివారమే అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. నేడు ఆయన్ని రాజమండ్రి జైలుకి తరలించారు. ఇంకా పలువురు సీనియర్ నేతలపై కేసులు నమోదై అరెస్ట్ కు సిద్దంగా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిపై నిర్భయ చట్టం సహా పలు సెక్షన్ల కింద నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
కోర్టు అదేశాల మేరకు ఇంకా ఆయన్ని ఆరెస్ట్ చేయలేదు. లేదంటే ఈపాటికే ఆయన్ని అరెస్ట్ చేసావాళ్లమని పోలీస్ అధికారులు తెలిపారు. ఇంకా యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప లపై కూడా ఆట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అంటే ఇప్పటివరకూ నలుగురు నేతలు జైలుకెళ్లగా, మరో ముగ్గురు వెళ్లడానికి లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా జగన్ హిట్ లిస్ట్ లో అదే పార్టీకి చెందిన నేతలు చాలా మందే ఉన్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేష్, పితానీ సత్యనారాయణ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నట్లు వినిపిస్తోంది.
జగన్ అధికారంలో ఉన్నంత కాలం అరెస్ట్ ల పర్వం అనేది ఎలాగూ కొనసాగుతుంది. అందుకు అందరూ మెంటల్ గా ఫిక్సైపోవ డమే మంచిదని భావిస్తున్నారుట. ఈ నేపథ్యంలో పార్టీలో చురుకుగా ఉన్న నేతలంతా గతంలో తాము చేసిన తప్పిదాలను, స్కామ్ ల గురించి గుర్తు చేసుకుంటున్నారుట. చట్ట ఫరిదిలో రుజవైతే జైలు కెళ్లడం ఖాయమని మానసికంగా సిద్దమవుతు న్నారుట. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ న్యాయ సలహాలు, వ్యూహాలు ఇప్పటి నుంచే సిద్దం చేస్తున్నారుట. ఇటీవలే లోకేష్ మాటలను బట్టి! ఆ సంగతి అర్ధమైంది. అచ్చెన్న ఫ్యామిలీని పరామర్శించిన సందర్భంలో ఐటీలో కుంభకోణం జరిగిందిట. అందులో మంత్రికి ఏ సంబంధం? అంటూ లోకష్ భుజాలు తడుముకున్న సంగతి తెలిసిందే.
అంటే ఆయన్ని ఏదో భయం వెంటాడుతుందన్న చర్చ అప్పుడే జరిగింది. ఇక తాజాగా ఓ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జిల్లాకు ఇద్దరు నేతల్ని అరెస్ట్ చేస్తారా? కీలకంగా ఉన్న వారందర్నీ జైలులో పెడతారట అని వ్యాఖ్యానించారు. అలా జైలులో పెడితే తమకే మంచిదని, ప్రత్యర్ధులపై కేసులు పెడితే ప్రభుత్వానికే మచ్చ అన్నారు. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు కరుణానిధి సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని అందర్నీ జైల్లో వేసారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ గెలవలేదు…2024 ఎన్నికల్లో వైకాపా అలాంటి పరాభవాన్నే ఎదుర్కుంటుందని ధీమా వ్యక్తం చేసాడు ఆ ఎమ్మెల్యే.