2019 ఎన్నికల్లో తగిలిన షాక్ ను టీడీపీ నేతలు ఎప్పటికి మరిచిపోలేరు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పన్నిన వ్యూహానికి చంద్రబాబు అండ్ కో బలైపోయారు. ఆ ఎన్నికల్లో వచ్చిన అపజయాన్ని టీడీపీ నేతలు ఇంకా మరిచిపోలేదు. ఎన్నికల్లో వచ్చిన ఓటమిని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు ఆ ఓటమిని ఈవీఎంల మీదకు నెట్టే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వైసీపీ ఎంత కారణమే టీడీపీ
కూడా అంతే కారణం. సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఈ మధ్య చంద్రబాబు నాయుడుకు అలవాటైపోయింది.
టీడీపీ సెల్ఫ్ గోల్
గతంలో చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహాలకు చిక్కని నాయకుడు లేడు. తాను టార్గెట్ చేసిన వారిని ఎలాగైనా మట్టికరిపించేవారు. అయితే ఈ మధ్య వయసు పెరగడం వల్ల అనుకుంటా సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటైంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత వైసీపీ నాయకులను చాలా ఇబ్బందులకు గురి చేసేవారు. ఇబ్బందులకు అనే కంటే కూడా ఒక రకంగా వైసీపీ నేతలతో ఆడుకున్నారు. టీడీపీ చేసిన చీప్ ట్రిక్ వల్ల ప్రజల్లో టీడీపీ మీద వ్యతిరేకత. పెరిగి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో సింపతీ పెరిగింది. ఆ సింపతీ 2019 ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా ఉపయోగపడింది. జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడితే జగన్ కృంగిపోతాడనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడుకే ఇబ్బందులు తెచ్చి పెట్టింది. అలాగే మరో సెల్ఫ్ గోల్ వేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.
బాబును తిరుతున్న టీడీపీ నేతలు
ఏపీ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇకపై ఉండదని టిడిపి గట్టిగానే వాయిస్ పెంచింది. ఈ విషయంపై జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదే విషయం చంద్రబాబును ఇబ్బందుల్లో పడేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు రైతుల పట్ల వ్యవహరించిన తీరును వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. విద్యుత్ చార్జీలపై గతంలో రైతులు ఉద్యమిస్తే కాల్దారి, బషీర్ బాగ్ లలో కాల్చి చంపింది ఎవరు అంటూ వైసిపి మంత్రులు చంద్రబాబు ను ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ అడిగిన పాపానికి రైతులకు లాఠీ దెబ్బలను రుచి చూపించింది చంద్రబాబు కాదా అంటూ చరిత్ర పురాణం లోకి వైసిపి వెళ్ళింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ అంతా ఇదే అంశంపై చంద్రబాబు ను టార్గెట్ చేసి తిట్టిపోశారు. వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువ చర్చ జరిగితే టిడిపి డిఫెన్స్ లో పడక తప్పదు. ఇలా చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకోవడంతో టీడీపీ నేతలు కూడా బాబును తిడుతున్నారు.