డ్వాక్రా మహిళలకు షాక్…ప్రమాణం చేయలేదని చావబాదారు

పసుపు కుంకుమ పథకంలో చెక్కులు అందుకున్న డ్వాక్రా మహిళలకు బ్యాంకులు షాకిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డ్వాక్రా మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు పసుపు కుంకుమ అనే కాపీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ మహిళలకు ఈ పథకంలో భాగంగా రూ 10 వేలను ప్రభుత్వం అందిస్తోంది. మహిళళ బ్యాకు ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమచేసి చెక్కులను మహిళలకు ఇస్తోంది.

అయితే, చెక్కులను అందుకున్న మహిళలు బ్యాంకులకు వెళ్ళినపుడు అక్కడ పెద్ద షాక్ తగులుతోంది. గతంలో ఉన్న బకాయిలను భర్తీ చేసుకునే మిగిలిన సొమ్మును బ్యాంకులు మహిళలకు అందిస్తున్నాయి. అదేమిటని మహిళలు అడితే మరి గతంలో చెల్లించాల్సిన బకాయిలను ఎవరు చెల్లిస్తారంటూ బ్యాంకు అధికారుల ఎదురు ప్రశ్నలతో దిమ్మ తిరుగుతోంది.

అంటే ఒకవైపు చంద్రబాబు చెక్కులు అందిస్తుంటే, మరోవైపు ఆ చెక్కుల్లోని సొమ్మును బ్యాంకులు పాత బకాయిలకు జమ చేసుకుంటున్నాయి. బకాయిలు పోగా ఏమైనా సొమ్ము మిగిలితేనే మహిళల చేతుల్లో పెడుతున్నాయి. దాంతో కొన్నిచోట్ల మహిళలు లబోదిబో మంటుంటే మరికొన్ని చోట్ల చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో డ్వాక్రా రుణాలన్నింటినీ తీర్చేస్తానని చంద్రబాబు చెప్పినందువల్లే మహిళలు బకాయిలు కట్టలేదు.

దాంతో లక్షలాది మంది మహిళలకు బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయాయి. ఇపుడు అవే ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంటే బ్యాంకులు బకాయిల నిమ్మితం జమచేసేసుకుంటున్నాయ్. సరే బాకీలజమ ఈ విధంగా ఉంటే అనంతపురం జిల్లాలో టిడిపికే ఓట్లేస్తామని ప్రమాణం చేయని మహిళలను మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో తమ్ముళ్ళు చావబాదటమే కాకుండా చివరకు చెక్కులు కూడా ఇవ్వలేదట. ఎంతో అట్టహాసంతో చంద్రబాబునాయుడు ప్రకటించిన, అందిస్తున్న పసుపు కుంకుమ చెక్కులతో మహిళలకు చుక్కులు కనబడుతున్నాయి.