మారుతున్న పరిణామాలు.. టీడీపీ, జనసేన వైసీపీకి పోటీ ఇవ్వలేవా?

తెలుగుదేశం, జనసేన పార్టీలు 2024 ఎన్నికల్లో అయినా వైసీపీకి గట్టి పోటీ ఇవ్వగలవా? అనే ప్రశ్నకు ఇవ్వలేవనే సమాధానం వినిపిస్తోంది. ఈ పార్టీలు పొత్తులో ఉంటాయని కొన్ని సందర్భాల్లో పొత్తులో ఉండవని మరికొన్ని సందర్భాల్లో జరిగిన ప్రచారం ఈ రెండు పార్టీలకు మైనస్ అవుతోంది. మోదీని కలవక ముందు టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

రాష్ట్రంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ సైతం ఎన్నికల్లో గెలుపు విషయంలో ఆశలు వదిలేసుకుంది. వైసీపీ, టీడీపీ తరపున పోటీ చేయడానికి చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తుండగా ఇతర పార్టీల తరపున పోటీ చేయడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదు. టీడీపీ, జనసేనలను నమ్ముకుంటే తమకు పొలిటికల్ భవిష్యత్తు ఉంటుందో ఉండదో అని చాలామంది రాజకీయ నేతలు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మళ్లీ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో భవిష్యత్తు ఎలా ఉండనుందో పవన్ కు ఇప్పటికే క్లారిటీ వచ్చిందని ఈ కారణం వల్లే పవన్ ఈ విధంగా చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు. రాజకీయాల్లో సక్సెస్ అవుతానని పవన్ కళ్యాణ్ భావించడం భ్రమే అవుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్, చంద్రబాబు ప్రజలకు మంచి చేసే దిశగా అడుగులు వేయకుండా ఎన్ని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనల ద్వారా దక్కే ఫలితం శూన్యమని మరి కొందరు చెబుతున్నారు. టీడీపీ సిద్ధాంతాలు మారకపోతే టీడీపీ నేతలు ఎంత కష్టపడినా ఫలితం శూన్యం అని చెప్పవచ్చు. ఇప్పటికైనా టీడీపీ ఇందుకు సంబంధించి మారుతుందేమో చూడాల్సి ఉంది.