టీడీపీ గెలిస్తే నాగబాబుకు రాజ్యసభ పవన్ సీఎం ?

టీడీపీ జనసేన పొత్తు ఉంటుందో లేదో తెలీదు కానీ ఈ పొత్తు కుదిరితే చంద్రబాబు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. పూర్తిగా ఐదేళ్లు కాకపోయినా కనీసం రెండున్నర సంవత్సరాల పాటు పదవిని పంచుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. బేరాలు తెగడం లేదు కాబట్టే పొత్తు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోగట్టా.

అయితే వైసీపీని ఓడించడం కోసం పవన్ చంద్రబాబు ఎన్నో అడుగులు వేస్తున్నారు. జగన్ మళ్లీ సీఎం కాకూడదనే పవన్ ఆకాంక్ష నిజం కావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఫెయిల్ అవ్వడానికి కూడా అన్నే అవకాశాలు ఉన్నాయి. పార్టీల పొత్తుల విషయంలో 2024 ఎన్నికలకు కొన్ని నెలల క్రితం వరకు ఏదీ తేలదని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థుల ఎంపికకు కూడా ఇదే సమస్య అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగబాబు తనకు రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉండటం వల్లే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్వార్థంతోనే ఎన్నికల విషయంలో ముందడుగులు వేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నా ఈ రెండు పార్టీలకు 151 సీట్లు రావడం సాధ్యమేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రెండు స్థానాలలో గెలవలేని పవన్ కళ్యాణ్ రాష్టంలో ఒక పార్టీని గెలిపిస్తారంటే నమ్మశక్యం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా చంద్రబాబుపై వ్యతిరేకతతో పోల్చి చూస్తే ఆ వ్యతిరేకత చాలా తక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ప్రజల వ్యతిరేకత ఏ పార్టీకి ప్లస్ అవుతుందో ఏ పార్టీకి మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.