టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు స్టార్ట్… షెడ్యూల్ ఇదే!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమండ్రి సెంట్రల్ జైల్ వేదికగా టీడీపీ – జనసేన పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఆ సమయంలో హర్ట్ అయిన పవన్ ములాకత్ లో బాబుని కలిశారు. అనంతరం బయటకు రాగానే తన అభిప్రాయంగా.. టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో ఈ పొత్తు పొడిచిన అనంతరం పలువురు కీలక నేతలు జనసేనకు రాజినామా చేశారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి పవన్ ని, నాదెండ్ల మనోహర్ ని దుయ్యబట్టారు. ఈ సమయంలో పొత్తు ప్రకటన తర్వాత ఇటీవల రాజండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలో ఉన్న హోటల్ లో ఈ రెండు పార్టీల నేతలూ భేటీ అయ్యారు. ఉమ్మడి కార్యచరణపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు.

అనంతరం చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలు చేయాలని తీర్మానాలు చేశారు. ఇదే సమయంలో నవంబర్ 1 న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో… నేటి నుంచి సమన్వయ సమావేశాలు జరపనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో… ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరుగున్నాయి.

ఈ క్రమంలో… ఉమ్మడి జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున నేతలు హాజరు కానున్నారని ప్రకటించారు. ఇందులో భాగంగా… శ్రీకాకుళం – వంగలపూడి అనిత, బొమ్మిడి నాయకర్.. విజయనగరం – బుద్దా వెంకన్న, కోన తాతారావు.. తూర్పుగోదావరి – కొల్లు రవీంద్ర, శివ శంకర్.. పశ్చిమగోదావరి – నక్కా ఆనంద్ బాబు, యశస్వీ లు సమన్వయకర్తలుగా ఉండబోతున్నారు.

ఇదే సమయంలో… ప్రకాశం – దేవినేని ఉమ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.. కృష్ణా – బండారు సత్యనారాయణ మూర్తి, చేగొండి సూర్య ప్రకాష్.. గుంటూరు – షరీఫ్, ముత్తా శశిధర్.. నెల్లూరు – ఎన్ అమర్నాధ్ రెడ్డి, పితాని బాలకృష్ణ.. కడప – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నయూబ్ కమల్.. చిత్తూరు – బీదా రవిచంద్ర, బోలిశెట్టి సత్య.. కర్నూలు – కాల్వ శ్రీనివాసులు, పెదపూడి విజయ్ కుమార్ పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు.

దీనికి సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో భాగంగా… ఆదివారం – శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరుగున్నాయి. సోమవారం – పశ్చిమ గోదావరి కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ.. ఎల్లుండి సోమవారం – విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 1 న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు!!