అయిపాయె.! చంద్రబాబు అస్త్ర సన్యాసం చేసేశారాయె.!

చంద్రబాబు చేతులెత్తేశారు.! ఔను, ఇకపై రాజకీయాలు చేయడం తన వల్ల కాదంటూ ఆయన దాదాపుగా అస్త్ర సన్యాసం చేసేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే, రాజకీయ సన్యాసం ప్రకటించేసినట్లే.!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఏమవుతుందో చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని కొన్నాళ్ళ క్రితమే ప్రకటించిన చంద్రబాబు, తాను గెలిస్తేనే అసెంబ్లీ గౌరవ సభ అవుతుందనీ, అప్పటిదాకా అది కౌరవ సభ మాత్రమేనని చెప్పేసుకున్నారు. సో, ఆ కౌరవ సభని గౌరవ సభగా మార్చాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే, చంద్రబాబు కుప్పం నుంచి గెలిచినా ప్రయోజనం లేదు. ఈ విషయాన్నే ఆయన స్పష్టంగా చెప్పేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని.

పోన్లే ఆఖరు ఛాన్స్ ఇచ్చేద్దాం.. అని రాష్ట్ర ప్రజలు అనుకునే పరిస్థితి వుందా.? ఏది ఏమైనా, నిలబడతాను.. అని చంద్రబాబు చెప్పగలిగితే అది వేరే లెక్క. చంద్రబాబు స్వయంగా చేతులెత్తేశాక టీడీపీలో మాత్రం ఎవరుంటారు.? చివరికి లోకేష్, బాలకృష్ణ కూడా టీడీపీని లైట్ తీసుకునే పరిస్థితి వస్తుందేమో.!

బాలకృష్ణదేముంది.? ఎంచక్కా సినిమాలు చేసుకుంటారు. లోకేష్ పరిస్థితి అది కాదు కదా.? అందుకే టీడీపీని నడపలేక, ఏదో ఒక పార్టీలోకి దూకెయ్యాలి. అరరె, చంద్రబాబు ఎంత పని చేసేశారు.?

కానీ, ఆ సన్యాసానికి కాస్త సమయం వుంది. 2024 ఎన్నికల వరకూ ఆయన ఆ సమయాన్ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టున్నారు. కానీ, ఈలోగా ఆ పార్టీని నాయకులు ఇంకా నమ్ముకుని వుండాలి కదా.? ‘ఇవే చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు చెప్పేశాక, పార్టీ నాయకులు ఈలోగానే ప్రత్యామ్నాయం చూసుకోకుండా వుంటారా.? చంద్రబాబు చారిత్రక తప్పిదం చేసేశారు. ఇక, టీడీపీని ఎవరూ కాపాడలేరు.