తెలంగాణ కాంగ్రెస్ లో ఒకేసారి నలుగురికి టెన్షన్ టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్ లో  ఒకేసారి నలుగురు లీడర్లకు టెన్షన్ పెరుగుతూ ఉంది. మహాకూటమి ఏర్పడితే గెలుస్తామని టి-కాంగ్రెస్ నాయకుల్లో ధీమా పెరుగుతూ ఉంటే, ఈ నాయకులకు మాత్రం టెన్షన్ పెరుగుతూ ఉంది. వారెవరనుకుంటున్నారు.  ఇటీవల టీఆర్‌ఎస్‌ కు గుడ్ బై కొట్టి హస్తం గూటికి చేరిన భూపతిరెడ్డి, సీనియర్ నాయకులు  అరికెల నర్సారెడ్డి, నగేష్‌రెడ్డి, భూమారెడ్డి.

భూపతి రెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరాడు. ఆయన నిజాంబాద్ రూరల్ నుంచి పోటీచేయాలనుకుంటున్నారు. ఆ సీటు తనకు వస్తుందనే గంపెడాశతో ఆయన  టిఆర్ ఎస్ కు ధైర్యంగా గుడ్ బై చెప్పారు. దానికి తోడు టిడిపి కాంగ్రెస్ లు కలిసి మహాకూటమిగా ఏర్పడితే, ఇక తన గెలుపునకు డో కా వుండదని ఆయన ఆశిస్తూ వస్తున్నారు. మిగతా నాయకులు కూడా ఈ సీటు కోసమే పార్టీని  నమ్ముకుని ఉన్నారు. అయితే, ఇపుడు ఒకగండం ఎదురయింది. అది కూడా టిడిపి నుంచే.

ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి మండవ వేంకటేశ్వరరావును ఇక్కడి నుంచి పోటీ చేయించాలనుకుంటున్నది. ఆ పార్టీ చేసిన సర్వేలలో మండవను నిలబెడితే, సెటిలర్ల ఓట్లు కూడ తోడయిన టిడిపి ఈజీగా గెలుస్తుందని తెలిందట అలాగే, ఇక రాజకీయాల్లో ఉండని రిటైరవుతున్నానని ప్రకటించిన మండవ వేంకటేశ్వరరావు కూడా మహాకూటమి అనేసరికి మరొక సారి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు.

తెలంగాణ వచ్చాక ఇక టిడిపి తరఫున గెలవడకష్టమనుకుని ఆయన రిటైరయినట్లు  ప్రకటించారు. అందుకే గత నాలుగేళ్లుగా ఒక రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. అయితే, ఇపుడు మహాకూటమి, కాంగ్రెస్ అండవస్తూండటంతో మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దానికితోడు టిడిపి సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయట. అందువల్ల నిజామాబాద్ రూరల్ టికెట్ ను టిడిపి తనకు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. నిజానికి ఒకపుడు ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోటే. ఇపుడు కాంగ్రెస్ అండతో మళ్లీ అక్కడ పచ్చజెండా ఎగరేయాలనుకుంటున్నది.

ఇక్కడ టిడిపికి ట్రెడిషనల్  ఓట్ బ్యాంక్ ఉందని, సెటిలర్లు ఎక్కువగా ఉన్నారని వారు టిడిపికే మద్దతిస్తారని చెబుతూ ఈ సీటును టిడిపి కోరనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్  కూడా టిడిపి పొత్తు కోసం ఉవ్విళ్లూరుతూ ఉంది. కొద్ది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించి టిడిపితో కలసి ఎన్నికలను పోరాడాలని కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అందులో  భాగంగా  పొత్తంటూ ఏర్పడితే, నిజామాబాద్‌ రూరల్‌ను టీడీపీకి కేటాయించాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించే ప్రమాదం ఉంది. ఇదే  భూపతిరెడ్డి,నర్సారెడ్డి, నగేష్ రెడ్డి,భూమారెడ్డిల టెన్షన్ కు కారణం.