బిగ్ ఇష్యూ… టీడీపీ – జనసేన సీట్ల సర్ధుబాట్లివే!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరస్టై రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కలిశారు. అనంతరం ములాఖ‌త్‌ పై చాలామంది ఊహించిన‌ట్టుగానే ఫలితాని ప్రకటించారు. ఇందులో భాగంగా పొత్తుపై ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని కుండబద్దలు కొట్టారు.

ఇదే సమయంలో టీడీపీతో కలిసి పోటీ చేయాలా వద్దా అనే సంశ‌యంలో ఉన్నాన‌ని, ఇవాళ్టితో క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు ప‌వ‌న్ చెప్పడం గమనార్హం. చంద్ర‌బాబు అంత‌టి నాయ‌కుడినే జైల్లో పెట్టిన‌ప్పుడు, ఇక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌కుండా ఎలా అనేది ఆయ‌న ప్ర‌శ్న! అయితే ఇది ఎప్పటినుంచో అనుకున్న విషయమే అని.. ఇదేమీ పెద్ద బ్రేకింగ్ న్యూస్ కాదనేది వైసీపీ నేతలు చేస్తున కామెంట్స్.

ఆ సంగతి అలా ఉంటే… పొత్తులు కన్ ఫాం అయిన వేళ ఇప్పుడు సీట్ల సర్ధుబాటు చర్చలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా ములాకత్ సమయంలోనే సీట్ల సర్ధుబాటుపై రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఒక క్లారిటీకి వచ్చారని, అదే విషయాన్ని పవన్ బయటకు వచ్చి పొత్తుగా కన్ ఫాం చేశారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు.. పవన్ కు ఎన్ని సీట్లు ఇచ్చారనే విషయంపై కీలకమైన సమాచారం అందుతుంది.

ఇందులో భాగంగా… జనసేన‌కు 23 అసెంబ్లీ, 3 లోక్‌ స‌భ స్థానాలు ఇచ్చేందుకు చంద్ర‌బాబు అంగీక‌రించారని తెలుస్తుంది. దీంతో… పవన్ కల్యాణ్ ఎంతో సంతోషించారని, హ్యాపీగా మరోమాట లేకుండా ఇందుకు అంగీక‌రించారని టీడీపీ వ‌ర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీంతో పవన్ కల్యణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక ఉన్నవాళ్లు లైట్ తీసుకోవాలనే కామేంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం… మిగిలిన 152 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలకూ టీడీపీ పోటీ చేయనుందని అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు ఉంటే… పవన్ అకౌంట్ లో నుంచి సీట్లు కట్ అవుతాయే తప్ప… టీడీపీ నాయకులు ఇంకా త్యాగాలు చేయకపోవచ్చని తెలుస్తుంది.

మరోపక్క బీజేపీతో పొత్తు లేకపోతే కమ్యునిస్టులు ఎలాగూ రెడీగా ఉంటారు కాబట్టి… వారికి అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు ఇవ్వకుండా… అవకాశం ఉంటే ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కమ్యునిస్టులు అందుకు ఒప్పుకునే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణే 23 కి ఒప్పుకున్నప్పుడు… కమ్యునిస్టులు ఎమ్మెల్సీకి ఒప్పుకోవడంలో తప్పులేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.