యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తారక్ ఎంట్రీ ఇస్తే ఏపీ రాజకీయాలలో సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేంద్రంలో మరో పదేళ్ల పాటు బీజేపీనే అధికారంలో ఉండే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీకి పోటీనిచ్చే మరో పార్టీ లేకపోవడం ఇందుకు కారణమని చెప్పవచ్చు.
బీజేపీ సపోర్ట్ తో తారక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం నష్టపోయే పార్టీ ఏదనే ప్రశ్నకు టీడీపీ అని సమాధానం వినిపిస్తోంది. కేసీఆర్ సర్కార్ తాజాగా బ్రహ్మాస్త్రం ఈవెంట్ ను క్యాన్సిల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ను గెలికిందని ఒక విధంగా తారక్ ప్రత్యక్ష రాజకీయాలకు ఇక్కడే బీజం పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వల్ల తారక్ తీవ్రస్థాయిలో మనస్తాపానికి గురయ్యారని అయితే తాను హర్ట్ అయినట్టు పైకి కనిపించకుండా తారక్ జాగ్రత్త పడ్డారని బోగట్టా.
కేసీఆర్ సర్కార్ ఈ విధంగా చేయడాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకునే ఛాన్స్ కూడా ఉంది. తారక్ రాజకీయ మూలాలు ఏపీలో ఉండటంతో తెలంగాణలో పరోక్షంగా తనకు అవమానం జరిగినా ఏపీపైనే తారక్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏపీ రాజకీయాలపై తారక్ దృష్టి పెడితే టీడీపీ రెండుగా చీలిపోయే అవకాశం అయితే ఉంది. టాలెంట్ తో సినిమాల్లో సంచలనాలు సృష్టించిన తారక్ పొలిటికల్ గా కూడా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.
బీజేపీ సైతం జూనియర్ ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ తారక్ కు దగ్గరవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా రాజకీయాలలో కూడా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.