రామతీర్థం ఘటన పైన స్పందించిన జగన్ ఫేవరెట్ స్వామీజీ .. జగన్ పై గట్టి కౌంటర్

swaroopanandendra saraswati demands justice for ramatheertham issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, దేవాదాయ ఆస్తులకు నష్టం కలుగజేయడం వంటి ఘటనలు పెచ్చుమీరిపోయాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికివేత వీటికి పరాకాష్టగా చెప్పాలి. ఈ దాడులపై అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, విపక్ష నేతలు అయితే, దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ మండిపడుతున్నారు. ఈ పరిణామాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.

swaroopanandendra saraswati demands justice for ramatheertham issue
swaroopanandendra saraswati demands justice for ramatheertham issue

రామతీర్థం ఘటనను ఉపేక్షిస్తే దేవాదాయశాఖ ప్రతిష్ఠ దిగజారుతుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితిని విధించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇప్పటివరకు వాస్తవాలను వెలికి తీయడంలో పోలీసులు విఫలమయ్యారని స్వరూపానందేంద్ర విమర్శించారు.