జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా తొల‌గించాలా.. ఇప్పుడిదే టాక్ ఆఫ్ ద పాలిటిక్స్..!

 Supreme Court Shocked To Jagans Opponents
YS Jagan Mohan Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కోర్టుల‌ను అడ్డం పెట్టుకుని జ‌గ‌న్ స‌ర్కార్‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌డు తాజాగా మ‌రోసారి జ‌గన్‌ను ఇర‌కాటంలో పెట్టాల‌ని భావించిన వారికి సుప్రీం కోర్టు చెంప చెళ్ళుమ‌నేలా నిర్ణ‌యం తీసుకుంది. దీంతో గంపెడు ఆశ‌లు పెట్టుకున్న జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌కు ఈసారి మాత్రం ఊహించ‌ని షాకే త‌గిలింది.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. ముఖ్యమంత్రిగా జ‌గ‌న్‌ను తొలగించాలంటూ జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం ధ‌ర్మాస‌నం, ఆ పిటిష‌న్‌కు విచారణార్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు సిటింగ్ జ‌డ్జి ఎన్వీ ర‌మ‌ణ‌తో పాటు న‌లుగురు హైకోర్టు న్యాయ‌మూర్తుల ‌పై పిర్యాదు చేస్తూ ఛీప్ జస్టిస్‌కు జ‌గ‌న్ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ ఫిర్యాదు లేఖ‌ను జ‌గ‌న్ మీడియాకు బ‌హిరంగ‌ప‌ర్చిన విష‌యం తెలిసిందే.

దీంతో జ‌గ‌న్ రాసిన లేఖను మీడియాకు విడుదల చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని, దీంతో జ‌గ‌న్ పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర‌డం జ‌రిగింది. ఈ పిటిష‌న్ పై కూడా నిర్ణాయాన్ని తెలిపిన సుప్రీం ధ‌ర్మాస‌నం.. ఇప్ప‌టికే గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. అంతే కాకుండా పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని త్రిస‌భ్య ధర్మాసనం పేర్కొన‌డం విశేషం.

అలాగే మీడియాల్లోనూ పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడమేంటని సుప్రీం ధ‌ర్మాస‌నం అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్లలో చేసిన‌ అభ్యర్థనలన్నీ గందరగోళంగా ఉన్నాయ‌ని, దాఖ‌లైన మూడు పిటిష‌న్ల‌లో రెండిటిని కొట్టివేసింది ధ‌ర్మాస‌నం. ఇక సీబీఐ దర్యాప్తు త‌మ ప‌రిదిలోకి రాని అంశ‌మ‌ని సీజేఐ పరిధిలోని అంశమని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో సుప్రీం కోర్టు తాజాగా వెళ్ళ‌డించిన నిర్ణ‌యంతో టీడీపీ త‌మ్ముళ్ళ‌కు, ఈ అంశం పై ర‌క‌ర‌కాలుగా డిబేట్లు చేసిన ఎల్లో మీడియాలకు ఊహించ‌ని దెబ్బే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.