కాలం ఎంత మారుతున్నా ఆడపిల్లలను చదివించే విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది డబ్బులు లేకపోవడం వల్ల ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను మార్చాలని కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే బాలికల చదువుల కోసం కేంద్రం బాలికా సమృద్ధి యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఈ స్కీమ్ ద్వారా కూతురు పుట్టినప్పటి నుంచి కూతురు పెరిగి ఉన్నత చదువులు చదివే వరకు ప్రతి ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. 1997 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ నుంచి ఈ స్కీమ్ దేశంలో అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులై ఉండాలి. 1997 ఆగష్టు 15వ తేదీన పుట్టిన ఆడపిల్లలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు.
ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఆడపిల్లలకు స్కాలర్ షిప్ ను అందించడం జరుగుతుంది. బాలికకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన బాలికకు మూడో తరగతి వరకు 300, 4వ తరగతి చదివే సమయంలో 400, ఐదో తరగతిలో 600, తొమ్మిది పది తరగతులలో 1000 రూపాయల చొప్పున స్కాలర్ షిప్ అందుతుంది.
ఆన్ లైన్ లో లేదా అంగన్ వాడీ కేంద్రం ద్వారా ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రంతో పాటు గార్డియన్ చిరునామా, తల్లి లేదా కూతురు బ్యాంక్ అకౌంట్ తల్లీదండ్రుల గుర్తింపు కార్డులు ఈ స్కీమ్ కు కీలకమని చెప్పవచ్చు. ఆడపిల్లలకు ఈ స్కీమ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.