బిగ్ న్యూస్ : చంద్రబాబుపై ఎన్నికల పోటీపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

YSRCP Lost 2024 elections

గత కొన్ని రోజులు నుంచి కూడా ఏపీలో మరియు సినీ వర్గాల్లో కూడా ఆసక్తిగా వైరల్ అవుతూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి పోటీగా వైసీపీ ఊహించని అస్త్రం వేస్తుందని సంచలన వార్తలు కాక రేపాయి. 

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కంచుకోట అయినటువంటి కుప్పం నియోజకవర్గంలో స్టార్ హీరో విశాల్ ని పోటీకి పెడుతున్నట్టుగా పలు వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై విశాల్ లేటెస్ట్ గా బిగ్ క్లారిటీ ఇవ్వడం వైరల్ గా మారింది. 

గత కొన్ని రోజులు నుంచి నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా వార్తలు ప్రచారం అవుతున్నాయన్న మాట నా దృష్టికి వచ్చింది. ఇవి అంతా తప్పుడు ప్రచారాలు అని నను ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు అలాగే నేను కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని తెలిపాడు. 

అంతే కాకుండా ఇవన్నీ ఎవరు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావట్లేదు, ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే ఉందని చంద్రబాబుపై పోటీ చెయ్యాలని ఏపీ రాజకీయల్లో దిగాలనే ఆలోచన నాకు లేదని విశాల్ అసలు విషయం క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇలాంటి క్లారిటీలు చాలానే చూసాము కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమన్నా జరిగే అవకాశం ఉందని చెప్పాలి.