నారా లోకేశ్ కు స్పెషల్ క్లాసులు.. ఇలాంటి నేతలు అవసరమా?

Moorkhudu Nara Lokesh

తెలుగుదేశం పార్టీ పరువు పోవడానికి కారణమైన వ్యక్తులలో లోకేశ్ ముందువరసలో ఉంటారు. చంద్రబాబు తన తెలివితేటలతో తెలుగుదేశం పార్టీకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కెరీర్ ను కొనసాగిస్తే లోకేశ్ మాత్రం తన జీవితంలో ముఖ్యమంత్రి అవుతారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. లోకేశ్ మరికొన్ని రోజుల్లో పాదయాత్ర చేయనుండగా ఈ పాదయాత్ర కోసం నారా లోకేశ్ కు స్పెషల్ క్లాసులు ఇప్పిస్తున్నారని సమాచారం.

అయితే ఈ తరహా క్లాసుల వల్ల నారా లోకేశ్ పుంజుకుంటాడని ఆశించడం వృథానే అని చెప్పవచ్చు. గతంలో కూడా చంద్రబాబు నారా లోకేశ్ కు తెలుగు క్లాసులు చెప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్ లాంటి నేతలు రాజకీయాల్లో అవసరమా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లోకేశ్ వల్ల టీడీపీకి, ప్రజలకు ఎలాంటి లాభం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

నారా లోకేశ్ కు కాకుండా సమర్థుడైన వ్యక్తికి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. లోకేశ్ టీడీపీలో యాక్టివ్ అయితే టీడీపీ చరిత్ర మరింత వేగంగా ముగుస్తుందని మరి కొందరు భావిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. నారా లోకేశ్ సైతం రాజకీయాల విషయంలో తన నిర్ణయాలను మార్చుకుంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు.

ఏపీ రాజకీయాలకు లోకేశ్ సూట్ కారని మరి కొందరు భావిస్తున్నారు. లోకేశ్ ఇప్పటివరకు ఎమ్మెల్యే కూడా కాలేదు. ఎమ్మెల్యేగా కూడా లోకేశ్ ను నమ్మని ప్రజలు ముఖ్యమంత్రిగా నమ్మడం సాధ్యమేనా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లోకేశ్ విషయంలో చంద్రబాబు ప్రయత్నాలు వృథా ప్రయాస అని మరి కొందరు చెబుతున్నారు.