గుడ్ న్యూస్: స్పీకర్ తమ్మినేని సీటు మారబోతుంది?

ఏపీలో మళ్లీ కేబినెట్ విస్తరణ వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేసిన వైఎస్ జగన్… ముచ్చటగా మూడోసారి కేబినెట్ 3.0 ని ప్లాన్ చేస్తున్నారంట. ఈ లిస్ట్ లో పాత మంత్రుల్లో కొందరికి మళ్లీ ఛాన్స్ రానుంటుండగా.. ఎవరూ ఊహించని వారికి కూడా అవకాశం రావొచ్చని అంటున్నారు. అందులో భాగంగా తాజాగా తెరపైకి వచ్చిన పేరు… స్పీకర్ తమ్మినేని సీతారాం.

అవును… ఈ సారికి తమ్మినేనినే పూర్తికాలం స్పీకర్ గా ఉంచి, నెక్స్ట్ గవర్నమెంట్ లో మంత్రిని చేస్తారని మొదట్లో జగన్ భావించారంట. అయితే మారుతున్న సమీకరణల నేపథ్యంలో… ఈసారే తమ్మినేనిని మంత్రి చేయాలని.. ఫలితంగా శ్రీకాకుళంలో కలిగంగుల మనసులు కొల్లగొట్టాలని భావిస్తున్నారంట. కాబట్టి… జగన్ క్యాబినెట్ లో కొనసాగుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒక వికెట్ పడనుందని తెలుస్తుంది. వీరిలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా కొనసాగనుండగా.. మత్య్స పశుసంవర్ధక శాఖా మంత్రిగా ఉన్న సీదరి అప్పలరాజును తప్పించనున్నారని తెలుస్తోంది.

సీదరి ప్లేస్ లో అదే జిల్లా నుంచి మరొకరికి చాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్న జగన్… బీసీ నేతగా, పెద్దాయనగా కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ని మంత్రిగా తీసుకోవాలని ఆలోచిస్తున్నారంట. ఇదే క్రమంలో… జగన్ ప్రత్యేకంగా సీతారాం ని పిలిపించుకుని మాట్లాడారని కూడా అంటున్నారు. దీంతో… ఇక తమ్మినేని మంత్రి అవ్వబోతున్నారనే వాదనకు బలం చేకూరింది.

చివరి సారిగా 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని.. మళ్ళీ రెండు దశాబ్దాల తరువాత 2019లో జగన్ వేవ్ లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుకు బద్ధ ప్రత్యర్ధిగా ఘాటైన మాటలతో దాడి చేసే సత్తా ఉన్న నేతగా పేరున్న సీతారాంను కింజరాపు ఫ్యామిలీకి కూడా గట్టిగా ఎదురునిలిచే నేతగా చెబుతుంటారు. ఇదే క్రమంలో.. శ్రీకాకుళం జిల్లాలో ఇరవై లక్షల మంది దాకా కాళింగ సామాజిక వర్గం ఉండనే ఉంది. ఇలా అని ఈక్వేషన్స్ ని చూసుకున్న జగన్… ఈసారి తమ్మినేనికి ఛాన్స్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. సో… ఇకపై స్పీకర్ తమ్మినేని కాస్త.. మినిస్టర్ తమ్మినేని అన్న మాట.

తమినేని మంత్రి అయితే ఖాళీ అయ్యే స్పీకర్ పోస్ట్ ని.. ఈసారి దళిత వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.