ఈ రోజు లోక్ సభలో ఆవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్న తెలుగుదేశం సభ్యడు గల్లా జయదేవ్ కు ఎక్కవ సార్లు అడ్డు చెప్పింది ఆశ్చర్యంగా లో క్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్. అన్ని పార్టీలకు ప్రసంగ సమయం కేటాయించినా, ఆవిశ్వా స తీర్మానం ప్రవేశపెట్టిన సభ్యుడికి కొంత వెసలు బాటు ఇస్తారు. ఆయన ఎంతసేపయినా మాట్లాడనిస్తారు. అపుడు గొడవ చేసేది ఇతర పార్టీ ల సభ్యులు. స్వీకర్ చూసీ చూడనట్లు పోతుంటారు. సోమనాథ్ చటర్జీ, జిఎంసి బాలయోగి లు స్పీకర్లు గా ఉన్నపుడు ఇలాగే జరిగింది. ఈసారి జయదేవ్ ను ఊపన్యాసం ముగించమని ఎక్కువ సార్లు చెప్పింది స్పీకర్ కావడం గమనార్హం.
ప్రధానమంత్రి మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ మీద చురలేస్తూ తీవ్రంగా వమర్శిస్తూ గల్లా జయదేవ్ ప్రసంగిస్తున్నపుడు స్పీకర్ సుమిత్రా మహాజన్ పలు మార్లు కలుగజేసుకుని ’ప్రసంగం ముగించాలి,’ అని సూచిస్తూ వచ్చార. ’ఇప్పటికే ఎక్కువ సమయం మాట్లాడారు. ఇక ముందు ఇతర సభ్యులు ఇలా చేయడానికి వీల్లేదు,’ అని అని కూడా అన్నారు. దీనిపై జయదేవ్ కూడ తగిన రీతిలోనే స్పందించారు. ‘మాట్లాడే సమయం విషయంలోనూ తమ మీద వివక్ష చూపవద్దు,’ స్పీకర్ ను కోరారు.