విశాఖ సాక్షిగా చంద్రబాబు కుర్చీకి బిగ్ షాక్

chandrababu gets another tension from telangana tdp leaders

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు పన్నిన రాజకీయ వ్యూహాలకు చాలా మంది రాజకీయ జీవితాలకు శుభం కార్డ్ పడింది. అయితే 2019 ఎన్నికల తరువాత ఏపీలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వైసీపీ ధాటికి టీడీపీ నాయకులు విలవిలలాడిపోతున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన బాబు ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేలేరని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

chandrababu naidu
chandrababu naidu

బాబుకు వస్తున్న ముప్పు ఏంటి?

2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో గెలిచింది. ఆ తరువాత టీడీపీ నుండి వల్లభనేని వంశీ వంటి నాయకులు టీడీపీకి రెబల్ గా మారారు. ఇలా మొత్తం టీడీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దింతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కి చేరుకుంది. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుండి బయటకు వెళ్తే చంద్రబాబు కూడా మాములు ఎమ్మెల్యేగా మరి ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని కూడా కోల్పోతారు. నిబంధలన ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే క్యాబినెట్ ర్యాంక్ తో విపక్ష నేత హోదా ఇస్తారు. బాబు మాములు ఎమ్మెల్యే అవ్వడానికి ఎంతో దూరంలో లేదని ఇపుడు టాక్ నడుస్తోంది. విశాఖకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీని వీడనున్నారని సమాచారం. ఇదే కనుక జరిగితే బాబుకు ఘోర జరుగుతుంది.

బాబు ఈ అవమానాన్ని తట్టుకోగలడా!

తాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానని, మరో మూడు సార్లు ప్రతిపక్ష‌ నేతగా పనిచేసానని చెప్పుకునే బాబు, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదని కోల్పోతే ఆ అవమానాన్ని తట్టుకోగలరా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలను నడిపించిన చంద్రబాబు ఇప్పుడు ఒక మాములు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుంటారో లేదో వేచి చూడాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోతే బీజేపీ నాయకులే వైసీపీ కంటే కూడా ఎక్కువ సంతోషిస్తారు. ఎందుకంటే ఎప్పటి నుండో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీ ఎదురు చేస్తున్న విషయం తెలిసిందే.