వైసీపీలో అంతా అయోమయం.? ఎందుకీ పరిస్థితి.?

పార్టీ ప్లీనరీ ఘనంగా జరుగుతోన్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ, పార్టీకి రాజీనామా చేశారు. తల్లిగా జగన్ వెంట వుంటానన్నారు. రాజకీయంగా తనయుడి వెంట వుండలేనని తేల్చేశారు. కుమార్తె వైఎస్ షర్మిలకి తెలంగాణలో రాజకీయంగా అండగా వుండాల్సిన బాధ్యత తన మీద వుందని చెప్పారు వైఎస్ షర్మిల.

వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ సేవలు అవసరం లేదు. అందుకే, ఆమెను పార్టీ లైట్ తీసుకున్నట్టుంది. రేప్పొద్దున్న తెలంగాణలోనూ షర్మిల పార్టీకీ వైఎస్ విజయమ్మ సేవలు అవసరం లేకపోతే, అప్పడు ఆమె పరిస్థితేంటి.?

వైఎస్ విజయమ్మ కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తల్లి మాత్రమే కాదు. ఆమె మాజీ ఎమ్మెల్యే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలు. విజయమ్మ మీద సింపతీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. అలాంటి విజయమ్మను పార్టీ ఎలా వదులుకోగలిగింది.? పైగా, ఈ వార్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ తెలియక ముందే టీడీపీ అనుకూల మీడియాకి తెలిసింది.

వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నట్లు కూడా టీడీపీ అనుకూల మీడియానే ముందుగా పసిగట్టింది. అప్పుడూ వైసీపీ నేతలు బుకాయించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు బుకాయించాల్సి వచ్చింది. ఇంతలా ఎందుకు వైసీపీలో అయోమయం.? ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్ని వెంటాడుతోన్న ప్రశ్న.

ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ తరహా ఆందోళన వుండకూడదు. ఈ గందరగోళం వైసీపీని రాజకీయాంగా దెబ్బ తీస్తుంది.