సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు అంటే సినిమా రంగానికి పూర్తిగా దూరమైనట్టే అనుకోవాలి. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి నాయకులు అలాగే చేశారు. పార్టీని ఒక కొలిక్కి తీసుకొచ్చాక మళ్ళీ కెమెరా ముందుకువెళ్లారు. అంతేకానీ తీరుతెన్ను లేకుండా పార్టీని నడుపుతూ సినిమాలు చేయలేదు. ఈవెన్ చిరంజీవి సైతం పార్టీ పెట్టాక సినిమాలను పక్కనపెట్టేశారు. రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పాకే ముఖానికి రంగువేసుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా నుండి రాజకీయాలోకి వచ్చిన వారు మాత్రం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఉదాహరణకు పవన్. పార్టీ పెట్టిన మొదట్లో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఆయన గత ఎన్నికల తర్వాత ఇకపై సినిమాలు లేవని ప్రకటించి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు.
దాంతో ఆయన్ను పార్టీ టైమ్ పొలిటీషియన్ అంటూ మిగతా పార్టీలు ఎద్దేవా చేశాయి. అయినా పవన్ పట్టించుకోలేదు. జోడు గుర్రాల సవారీ చేస్తూనే ఉన్నారు. అయితే నిజానికి ఇక్కడ పార్టీ టైమ్ పొలిటీషియన్ పవన్ కాదు బాలకృష్ణ. బాలయ్య రెండవ దఫాలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఏనాడూ ఆయన సినిమాలను వదల్లేదు. నిజం చెప్పాలంటే రాజకీయాలకే ఆయన తక్కువ టైమ్ ఇచ్చారు. పార్టీ పెట్టినా కూడ పవన్ ఏలాంటి పదవిలోనూ లేరు. ఆయన్నే పార్ట్ టైమ్లిపొటీషియన్ అన్నప్పుడు బాలయ్య ఎమ్మెల్యే పదవిలో ఉండి సినిమాలు చేయడాన్ని ఇంకేమనాలి. తాజాగా ఒక సన్నిహిత నేతతో బాలయ్య మాట్లాడిన ఫోన్ కాన్వర్జేషన్ బయటికొచ్చింది. అందులో బాలయ్య ప్రజెంట్ చేస్తున్న సినిమా అయిపోగానే పూర్తిగా రాజకేయాల్లోకి వచ్చేస్తానని అన్నారని చెబుతున్నారు.
అంటే ఇన్నాళ్లు అయన పూర్తిగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలేదా. మరి ఎమ్మెల్యే పదవి సంగతేంటి. ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇన్నాళ్లు నేను పార్టీ రాజకీయాల్లో లేను అనే అర్థం వచ్చేలా మాట్లాడారు అంటే ఆయన సంపూర్తిగా ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించలేదనే అర్థం వస్తోంది. అంటే సినిమాలను ఫుల్ టైమ్ జాబ్ అనుకుని ఎమ్మెల్యే పదవిని పార్ట్ టైమ్ జాబ్ అని భావించారన్నమాట బాలయ్య. దీన్నిబట్టి పవన్ కంటే బాలయ్య పెద్ద పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనుకోవాలేమో. ఇక బాలయ్య ఉన్నట్టుండి ఇలాంటి పూర్తిస్థాయి రాజకీయాలని అంటుండటం చూస్తే పార్టీలో ఏదో పెద్ద మార్పే జరగబోతుందని, బాలయ్యకు కొత్త పదవి ఏదో దక్కబోతుందని అర్థమవుతోంది. మరి ఆ మార్పు టీడీపీ నాయకత్వ బాధ్యతల మీద ప్రభావం చూపుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.