ఆంధ్రలో కాంగ్రెస్ ఏముంది? ఏమీ లేదని, మా రోల్ చాలా తక్కువని, దాదాపు నలభై యేళ్ల పైబడి రాష్ట్రాన్నిపరిపాలించిన కాంగ్రెస్ నేతలు నీరసంగా చెప్పకుంటున్నారు.
పార్టీకి భవిష్యత్తు లేదనుకున్నవాళ్లంతా వైసిపిలోకో, టిడిపిలో కో వెళ్లిపోయారు. అంతో ఇంతో పేరున్న వాళ్లని ఆ పార్టీలు ఎర వేసి లాక్కున్నాయి. అయితే, కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని తెలిసినా, గెలుస్తామో లేదా గ్యారంటీ లేకపోయినా, పార్టీ పునరుజ్జీవం పొందుతున్న నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ నేతలూ ఉన్నారు ఆంధ్రలో. ఎంత మంచి ఆఫర్ వచ్చినా వాళ్లు కాంగ్రెస్ వదిలేందుకు సిద్ధంగా లేరు. అలాంటి వాళ్లలో
అనంతపురం జిల్లాకు సింగనమలకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఒకరు.
ఎన్నివత్తిళ్ళు వచ్చినా పార్టీ మారకుండా కాంగ్రెస్ లోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు మాజీమంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్.
అంతేకాదు 2019 ఎన్నికల్లో శింగనమల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోనిలిచేది తానే నని గర్వంగా చెప్పుకుంటున్నారాయన.
ఎన్నికల్లో నిలబడతా,సత్తా చాటుతా అని చెబుతున్నారు.
ఆయన తన సన్నిహితులతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించి వాళ్లందరి ఉత్సాహపరిచారు ఈరోజు.
‘నేను మంత్రిగా,శాసనసభ్యునిగా నియోజకవర్గానికి అందించిన సేవలను ప్రజలు మరిచిపోలేదు. మర్చిపోలేరు అనుకుంటున్నా.అవే మనకు ఆశీస్సులు.మనం గెలిచి వస్తే భవిషత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే నమ్మకం వాళ్లలో కలిగించాం. ప్రజల ఆకాంక్షలే మనకు విజయ సోపానాలుగా నివలవబోతున్నాయి,’ అని ఆయన చెప్పారు. తనసన్నిహితులను, కార్యకర్తలను, అభిమానులను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నారు.
ఎన్నికల కోసం ప్రచారరథాలను సైతం సిద్ధం చేసుకున్నారు.
ఇంతకు చెప్పొచ్చేదేమంటే, శైలజా నాథ్ ఎన్నికల ముందు టిడిపిలోకి వెళ్తారని ప్రచారం ఇంకా సాగుతూనే ఉంది.
ఇపుడాయన నిర్వహించిన సమావేశాలు,ఆయన ఉపన్యాసం, అభిమానుల్లో ఉత్సాహం చూశాక టీడీపీ లోకి వెళ్తారన్నది కేవలం పుకారు మాత్రమే అని అనుకోవాలా?