AP: జగన్ కు షాక్ జనసేనలోకి తమ్మినేని…ఈ ట్విస్ట్ ఊహించలేదుగా?

AP: ఏపీలో కూటమి పార్టీలు 164 స్థానాలలో విజయం సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చాయి ఈ విధంగా కూటమి పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో వైకాపా పార్టీకి చెందినటువంటి ఎంతోమంది నాయకులు తమ పార్టీకి గుడ్ బై చెబుతూ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇస్తున్నారని చెప్పాలి. ఇలా వైసిపి నుంచి కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉండగా మరికొందరు మాత్రం తెలుగుదేశం పార్టీలోకి అలాగే జనసేనలోకి అడుగుపెడుతున్నారు.

ఈ క్రమంలోనే వైసిపి హయామంలో స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారామ సైతం జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపించాయని,ఈయన కూడా తన పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి చేరాలనే ఆలోచనలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. ఇలా వైకాపా పార్టీలో ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఈయనకు ఏకంగా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పదవిని ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం పార్టీని విడిపోవడం జగన్మోహన్ రెడ్డికి నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇలా తమ్మినేని సీతారాం జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై తమ్మినేని స్పందించారు. మా కుటుంబ రాజకీయాల గురించి గత కొంతకాలంగా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇటీవలే నా కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించాను. 15 రోజులుగా నా కుమారుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి దగ్గరే ఉన్నాను. ఇలా హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలోనే తాను ఎలాంటి పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నాను.

ఇలా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటే పార్టీ మారుతున్నట్టు అర్థం కాదని అయిన నాకు వైకాపా పార్టీని వీడి జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటూ ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం పార్టీ మారడం గురించి వస్తున్నటువంటి వార్తలపై ఘాటుగా స్పందిస్తూ తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు.