ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వైఎస్సార్ బీమా పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు కాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్కీమ్ కు సంబంధించిన బీమా మొత్తాన్ని చెల్లించనుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉనవాళ్ల కోసం ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
ఈ స్కీమ్ ద్వారా కుటుంబ పెద్ద సహజంగా మరణించినా లేదా ప్రమాదవశాత్తూ చనిపోయినా బీమా అందుతుంది. https://ysrbima.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే ఫ్యామిలీకి లక్ష రూపాయలు చెల్లిస్తారు. ఒకవేళ 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేక అంగవైకల్యం సంభవించినా 5 లక్షల రూపాయలు ఇస్తారు.
పేదలు, అసంఘటిత కార్మికులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. తల్లీదండ్రులు, భార్య, కొడుకును నామినీగా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.
రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్ కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ ఇతర వివరాలను అందజేయడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పేద ప్రజలకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.