వివేకా హత్య కేసులో వెలుగులోకి మరో వ్యక్తి.. ఈ కేసుతో సంబంధం ఉందా?

257784-ys-viveka

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎన్నో ట్విస్టులు ఉన్న సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ కేసులో తాజాగా నవీన్ అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ పేరు వెలుగులోకి రాగా ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఈ నవీన్ అనే వ్యక్తి అసలు పేరు హరిప్రసాద్ కాగా ఈయన జగన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరు.

జగన్ బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన పనులను ఇతనే చూసుకున్నారని బోగట్టా. ప్రస్తుతం జగన్ ఫ్యామిలీ తాడేపల్లిలో ఉండగా హరిప్రసాద్ తన ఫ్యామిలీతో ఇక్కడే ఉన్నారని సమాచారం. అవినాష్ రెడ్డి ఎక్కువసార్లు కాల్ చేయడం వల్ల ఈ పేరు వెలుగులోకి రాగా ఈ వ్యక్తికి ఈ కేసుతో నిజంగా సంబంధం ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

సీఎం జగన్ ఇంటిపనులన్నీ ఈ వ్యక్తే చక్కదిద్దేవాడని సమాచారం. సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి దూకుడు పెంచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఏళ్లు గడుస్తున్నా వాస్తవాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు. వివేకా హత్య కేసుకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.

వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో తేలని పక్షంలో వైసీపీకే తీవ్ర స్థాయిలో నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మరోవైపు రాజధాని విషయంలో క్లారిటీ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. విశాఖను రాజధాని చేయాలని జగన్ భావిస్తున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.