వివేకా హత్య కేసులో దోషులు దొరికినట్టేనా.. ఆ నోటీసులతో తేలిపోనుందా?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి చాలా మందిపై అనుమానాలు ఉన్నాయి. వివేకాను ఎవరు హత్య చేశారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. అయితే సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

వివేకా హత్య జరిగిన సమయంలో కొన్ని సాక్ష్యాలను తారుమారు చేశారని అనుమానాలు ఉన్నాయి. వివేకా హత్య కేసుకు సంబంధించి పరిష్కారం దొరికితే బాగుంటుందని టీడీపీ, వైసీపీ నేతలు భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వివేకా హత్య జరగగా ఈ హత్య కేసుకు సంబంధించిన దోషులు దొరకాలని వైసీపీ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. వివేక హత్య కేసుకు సంబంధించి ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

తెలంగాణ సీబీఐ వీలైనంత వేగంగా ఈ కేసును పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. వివేకా హత్య కేసు దోషులకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగకుండా సీబీఐ అడుగులు వేయాల్సి ఉంది. నిందితులు అధికార బలం ప్రయోగిస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

వివేకా హత్య కేసు ప్రశ్నలకు సమాధానాలు దొరికితే జగన్ కు టెన్షన్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే వివేకా హత్య కేసు దోషులు తేలితే వైసీపీకి లాభం కలుగుతుందో లేక నష్టం కలుగుతుందో చూడాల్సి ఉంది.