తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికల్లో గెలవడం కోసం పార్టీలు ఇస్తున్న హామీలు మామూలుగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీ ఇంటికి 40,000 రూపాయలు ఇస్తామని చెబుతుండగా మరో పార్టీ ఏకంగా తులం బంగారం ఇస్తామంటూ సంచలన ఆఫర్ ను ప్రకటించిందని సమాచారం అందుతోంది. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కట్టిన విలువ తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.
ఓట్ల విలువ ఈ స్థాయిలో పెరిగిపోతుందని కలలో కూడా ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నామినేషన్లు ముగిసే సమయానికి ఈ మొత్తం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. బీజేపీ, బీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం. ఈ ఆఫర్ల విషయంలో ఓటర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
మునుగోడు నియోజకవర్గంలో ఓట్ల నమోదు కార్యక్రమానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు మునుగోడులో ఓటర్ల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో డబ్బు కీలక పాత్ర పోషిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీ.ఆర్.ఎస్ పార్టీలు ఎన్నికల ఖర్చు విషయంలో ఏ మత్రం రాజీ పడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మునుగోడు ఎన్నికల సమయానికి స్థానికంగా పరిస్థితులు ఏ విధంగా మారతాయో చూడాల్సి ఉంది. మునుగోడులో ఓటర్ల తీర్పు అంచనా వేయలేకపోతున్నామని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా మెజారిటీ మాత్రం స్వల్పంగానే ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.