షాకింగ్ డెసిషన్: పవన్ – బాలయ్య లను ఫాలో అవుతున్న లోకేష్!

ప్రస్తుతం “యువగళం” పాదయాత్రలో ఫుల్ బిజీగా ఉన్నారు నారా లోకేష్. ఇప్పటికే వందరోజులు, వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసి టీడీపీ కార్యకర్తలకు యాత్ర పూర్తిచేస్తారనే నమ్మకం కలిగించారు. ఆ సంగతులు అలా ఉంటే… ప్రస్తుతం లోకేష్ ఒక షాకింగ్ డెషిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా… తన సోదర సమానుడు పవన్ కల్యాణ్, తమ మామ నందమూరి బాలకృష్ణలను ఫాలో అవుతున్నారని తెలుస్తుంది.

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన నారా లోకేష్, ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఓటమి లోకేష్ సామర్ధ్యంపై సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు సైతం నమ్మకాన్ని తుడిచివేసింది. అయితే ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా పాదయాత్రలో ఉన్న ఆయన… ఈసారి మంగళగిరితో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీచేస్తే బెటరని ఆలోచిస్తున్నారంట.

అవును… ఇప్పటికే మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన జగన్.. తన సైన్యాన్ని అన్ని రకాలుగానూ అక్కడ మొహరించారు. ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల పత్రిక నాలుగు రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేసింది. ఈసారి మంగళగిరిలో చినబాబు ఓటమి తప్పదని పరోక్షంగా నిర్ధారించింది. దీంతో… రాబోయే ఎన్నికల్లో మంగళగిరితో పాటు నంద్యాల అసెంబ్లీ సీటు నుంచి కూడా పోటీచేయాలని లోకేష్ భావిస్తున్నారంట. ఫలితంగా… మంగళిగిరిలో జనం తన పొలిటికల్ కెరీర్ కు మంగళం పాడేసినా… టీడీపీ బలంగా ఉన్న నంద్యాలలో అయినా గట్టెక్కేయొచ్చని ఆలోచిస్తున్నారంట.

ఇలా రెండు నియోజకవర్గాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే విషయంలో పవన్ ని ఫాలో అయిన లోకేష్… సేఫ్ జోన్ విషయంలో తన మామ బాలయ్యను ఫాలో అయితే బెటరని మరో ఆలోచనలో ఉన్నారంట. అందులో భాగంగా బాలయ్య, హిందూపూర్ ని సెలక్ట్ చేసుకున్నట్లు తానకు కూడా మరో కంచుకోటని చూడాలని.. అక్కడ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచేస్తారనే స్థాయి ధైర్యం ఉండాలని కోరుతున్నారంట. ఈ క్రమంలో.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీటు మీద కూడా లోకేష్ కన్ను ఉందని అంటున్నారు.

మరి ఈసారి ఏదోరకంగా అసెంబ్లీ గేటు తాకాలని భావిస్తున్న లోకేష్ ను ఏ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారో వేచి చూడాలి. అయితే ఈ సందర్భంగా లోకేష్ విషయంలో మాత్రం… గాజువాక – భీమవరం లా కాకూడదని కోరుకుంటున్నారంట తమ్ముళ్లు.