సీనియర్ కాపు నేత టిడిపికి గుడ్ బై, వైసిపిలో చేరే సూచనలు

కాపు నాయకుడు , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ బూరగడ్డ రమేశ్ నాయుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.  పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  సోమవారం సాయంత్రం తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు.

దాదాపు 3 దశాబ్దాలుగా రమేశ్ నాయుడు తెలుగుదేశం పార్టీకి సేవలందించారు. చాలా మంది కాపు నాయకులు పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు టిడిపి వదిలేశారు.అయితే, రమేష్ నాయుడు మాత్రం టిడిపినే అంటిపెట్టుకుని ఉన్నారు. అయినా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇది తనను అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు.  అందువల్ల ఆయన పార్టీని వదిలేయాని నిర్ణయించుకుని లేఖని తెలుగుదేశం అధ్యక్షుడికి పంపించారిన బూరగడ్డ యువసేన నాయకుడొకరు ‘తెలుగు రాజ్యం ’ కుతెలిపారు రమేశ్ నాయుడితో మాట్లాడి వివరాలుసేకరించేందుకు ఈ ప్రతినిధి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

‘పార్టీ నాయకుడి  35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేశాను . ప్రతిపక్షంలో ఉన్నపుడు నా  సేవలను వాడుకున్నారు.  ఇపుడు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం మానేశారు,’ అని ఆయన బాధపడుతున్నారని తెలిసింది. రమేశ్ రాజీనామా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ అని అంటున్నారు.

రమేశ్ నాయుడు పూర్వం  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. అలాగే 1999, 2004లో   జరిగిన ఎన్నికల్లో అవనిగడ్డ నుంచిప ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ చేతిలో  ఓడిపోయారు. ఇపుడు మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఇపుడు తాజాగా బూరగడ్డ వేదవ్యాస్ కు మఛిలీ పట్నం అర్బన్ డెవెలప్ మెంట్ అధారిటీ ఛెయిర్మన్ పదవి రావడంతో రమేశ్ నాయుడు కినుక వహించారు. తనని పార్టీ పక్కన పెట్టి కొత్త గా పార్టీల్ చేరిన వారికి  పదవులిస్తున్నదని ఆయన భావిస్తున్నారు.

ఆయన భవిష్యత్ కార్యక్రమం గురించిన వివరాలు తెలియడం లేదు. అయితే, ఆయన ముందు మూడు అప్షన్లు న్నాయని ఆయన సన్నిహితులు చెప్పారు.  కాపు నాయకుడిగా ఆయనను తమ పార్టీలోకితీసుకునేందుకు వైసిపితోపాటు, బిజెపి, జనసేన ప్రయత్నించవచ్చు.  మూడు పార్టీలకుకృష్ణా జిల్లా ముఖ్యమయినది.   అయితే,   ఆయన  వైసిపి వైపు మొగ్గు చూపవచ్చని చెబుతున్నారు.