టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్దుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించి వారికి బీఫాంలు కూడా అందజేశారు. దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు కాస్త డీలా పడ్డారు. 10 మంది కొత్త వారికి అవకాశాలు కల్పించారు. ఏడుగురు సిట్టింగ్ లకు చాన్సిచ్చారు. దీని పై మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ స్పందించారు.
“అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్టు నాకే అని సీఎం కేసీఆర్ స్వయంగా భరోసా ఇచ్చారు. ఇప్పుడేమో హ్యాండిచ్చారు. నేనేం తప్పుచేశానో అధిష్ఠానానికే తెలియాలి. అడిగితే సర్వే నివేదిక బాగాలేదని, ఎమ్మెల్యేలతో కో ఆర్డినేషన్ సరిగా లేదని చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయంతో నాతో పాటు నా కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు., టీఆర్‌ఎస్‌లో కారు…సారూ అంతా కేసీఆర్ అన్నారు. ఆయననే నమ్ముకున్నాను. ఆయనే ఇక ఏదో ఒకటి చేయాలి. తాను ఎట్టి పరిస్థితిలో పార్టీ మారను. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు” అని సీతారాం నాయక్ అన్నారు.