రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే కష్టాలు తప్పవని మద్రాస్‌కు చెందిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలో పేర్కొన్నట్లు ప్రభుత్వం ప్రకటించిన వార్తలను టీడీపీ నేత వర్ల రామయ్య కొట్టి పారేశారు. అసలు తాము అమరావతిపై అధ్యయనమే చేయలేదని ఆసంస్థ చెబుతోందని అన్నారు. ఇలాంటి అధ్యయనాలకు మెటియరాలజీ అనే విభాగం ఉండాలని మద్రాస్ ఐఐటీలో అలాంటి విభాగమే లేదని వారు చెప్పారన్నారు. బోస్టల్ నివేదికలో తప్పుడు అంశాలు పొందుపరచడం ద్వారా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసంచేస్తోందని విమర్శించారు. పైగా గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతిని ఎలాంటి వరద ముంపు ప్రాంతంగా పరగణించలేమని పేర్కొంది. దీనికి ఏమంటారని ప్రశ్నించారు.
అయితే తేదేపా తన పంతం నెగ్గించుకునేందుకు తన సొంత మీడియాల్లో ఊకదంపుడు ప్రచారం చేస్తోందని.. ఇందులో అసత్య ప్రచారం సాగించడంపై వైకాపా శ్రేణులు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. తాజా సన్నివేశంలో ఏ పత్రికలో ఏ వార్త వెలువడుతోందో.. ఏది సత్యం? ఏది అసత్యం? అన్న కన్ఫ్యూజన్ నెలకొంది.