బిగ్ న్యూస్: ఏపీలో ఏ1 – ఏ2 లు మారిపోయారు!

ఇంతకాలం అటు టీడీపీ నేతలు, ఇటు వారికి అన్ కండీషనల్ గా మద్దతు తెలిపే ఒక వర్గం మీడియా… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్థావనకు వచ్చిన ప్రతీసారీ ఏ1 జగన్ అని… విజయసాయిరెడ్డి పేరు పలకాల్సి వచ్చినప్పుడు ఏ2 సాయిరెడ్డి అనీ సంబోదించేవారు! ఈ విషయంలో చంద్రబాబు నుంచి చోటామోటా నేతల వరకూ ఇదే పేరుతో వారిద్దరినీ సంబోధించేవారు. అయితే… తాజాగా ఏ1 – ఏ2 లంటూ జగన్ – విజయసాయిలను అనలేని పరిస్థితి అటు టీడీపీ నేతలకు, అలా సంబోధించలేని పరిస్థితి వారి అనుకూల మీడియాకు ఎదురైంది!

అవును… తాజాగా ఏపీ సీఐడీ మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అక్రమాలు చేస్తున్నారంటూ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరూకూరి రామోజీరావు ఏ-1, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ, రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ-2 గా, మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లను ఏ-3 లుగా పేర్కొంటూ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది ఏపీ సీఐడీ! దీంతో.. “ఇకపై ఏ-1 అంటే రామోజీరావు కూడా.. ఏ-2 అంటే రామోజీ కోడలు శైలజ కూడా” అనే కామెంట్లు నెట్టింట కనబడటం మొదలయ్యింది!

ఇక ఈ కేసు విషయానికొస్తే… ఈనాడు రామోజీ­రావుకు చెందిన మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ… రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న సంగతి మరోసారి వెలుగులోకి వచ్చింది! కొన్ని నెలల క్రితం స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆ సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాలతో అక్రమాల డొంక కదిలింది. దీనిపై ఆ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో సీఐడీ రంగంలోకి కేసు నమోదు చేసింది.

అవును… చట్టాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న విషయం స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా తెలుసుకున్న సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ, రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు! వారిపై సెక్షన్లు 120(బి), 409, 420, 477(ఎ) రెడ్‌ విత్‌ 34 సీఆర్‌సీపీ కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999, చిట్‌ ఫండ్‌ చట్టం–1982 కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

కాగా… దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. అప్పట్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది కూడా. దాంతో తాము తప్పు చేశామని రామోజీరావు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తూ డిపాజిట్‌ దారులకు వారి డిపాజిట్‌ మొత్తాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే!

దాంతో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఇక డిపాజిట్ల సేకరణను నిలిపి వేసిందని అంతా భావించారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా “రశీదు”ల రూపంలో అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా స్టాంప్స్‌–రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైంది. దీంతో రామోజీరావు ఏ-1 గా, ఆయన కోడలు ఏ-2 గా సీఐడీ అధికారులు కేసు నమోదుచేశారు!!

YouTube video player