ఆ కార్డుతో ఎస్బీఐ మూడు లక్షల రూపాయల లోన్.. ఎలా పొందాలంటే?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఎలాంటి గ్యారంటీ లేకుండా రైతులకు ఎస్బీఐ 3 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సహాయంతో రైతులు ఈ రుణాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్బీఐ అందించే ఈ కార్డ్ రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది.

ఈ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లకు ఖాతాలో ఎంత మొత్తం బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తానికి వడ్డీ లభిస్తుంది. ఈ కార్డ్ వ్యవధి 5 సంవత్సరాలు కాగా ప్రతి సంవత్సరం కార్డ్ పరిమితి 10 శాతం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పంట మార్కెటింగ్ పీరియడ్ ఆధారంగా రుణాన్నితిరిగి చెల్లించే వ్యవధి ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. 45 రోజులకు ఒకసారి కార్డును యాక్టివేట్ చేసిన వాళ్లకు లక్ష రూపాయల బీమా లభిస్తుంది.

70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ ద్వారా రుణం తీసుకోవడానికి అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకునే రుణాలకు 7 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఎస్బీఐ పోర్టల్ లో దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. యోనో ఎస్బీఐకి లాగిన్ అయ్యి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

యోనో ఎస్బీఐ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్నిసార్లు బ్యాంకుకు సెక్యూరిటీ పోస్ట్ డేటెడ్ చెక్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.