ఆయన భాషలో సముద్రాల ఘోష! – సముద్రాల సీనియర్ జయంతి

జగమే మాయ.. బ్రతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా..

కల ఇదనీ నిజమిదని తెలియదని.. బ్రతుకింతేనయా..

పాటలతో ప్రేక్షకులను శోక సముద్రాలలో ముంచెత్తిన సముద్రాల..!

పాప పుణ్యాలు విచారించే భగవంతుడు నీకెలాంటి శిక్ష విధిస్తాడో గాని మళ్లీ జన్మంటూ ఉంటే నీ భర్తగా పుడతానమ్మి..

ఇలాంటి మాటలూ ఆ సముద్రాల ముద్రలే.. ఆయన పాటలు పరమపదానికి బాటలు.. త్యాగయ్య కీర్తన.. అనార్కలి వర్ణన.. మదన మనోహర సుందర నారి.. మధుర దరస్మిత నయన చకోరి.. మందగమనజిత రాజమరాళి.. నాట్యముయూరి.. సముద్రాల ఝరి.. పదాల వల్లరి..!

చిగురాకులలో చిలకమ్మా… చిన్న మాట వినరావమ్మా.. మరుమల్లెలలో మావయ్యా.. మంచి మాట సెలవీవయ్యా.. వినసొంపైన గీతం.. రారోరి మా ఇంటికి.. ఓ మావ..మాటున్నది మంచి మాటున్నది.. అదే సినిమాలో నాయిక చిలిపి.. సముద్రాల చిలికి..!

లవకుశ..అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలరించే పాటలు.. భక్తి సుమాల పూదోటలు..!

సముద్రాల.. ఈ కవి తల నిండా కవితలే.. తొమ్మిదిలోనే చిగురించి.. ఉభయభాషా ప్రవీణుడై.. వాహినికి ఆస్థాన రచయితగా మారిన అష్టావధాని.. పూటకో పాట చందాన పాటల కెరటాలు.. ఈ సముద్రాల చరిత్ర పుటలు..!

సాహితీ సాగరాల మథనం.. సముద్రాల జీవిత కథనం..!