ఈనాడు, ఆంధ్రజ్యోతిలను తొక్కేసిన సాక్షి.. అదే ప్లస్ అయిందంటూ?

ఒకప్పుడు వార్తలు తెలుసుకోవడానికి చాలామంది న్యూస్ పేపర్లపై ఆధారపడేవారు. న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలే నిజమని చాలామంది భావించేవారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా సమయంలో న్యుస్ పేపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందవచ్చని జరిగిన ఫేక్ ప్రచారం వల్ల ప్రముఖ పత్రికల సర్క్యులేషన్ ఊహించని స్థాయిలో తగ్గిపోయింది.

మరోవైపు పత్రికల రేట్లు అంతకంతకూ పెరగడం వల్ల కూడా చాలామంది ఆన్ లైన్ లో పేపర్ చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో న్యూస్ పేపర్ వేయించుకోవడం ప్రిస్టేజీగా ఫీలైన వాళ్లు సైతం ప్రస్తుతం న్యూస్ పేపర్ వేయించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. కరోనా సమయంలో సర్క్యులేషన్ తగ్గడంతో చాలా పత్రికలు పేజీల సంఖ్యను తగ్గించేశాయి.

తెలుగు పత్రికల సర్క్యులేషన్ భారీగా తగ్గగా మిగతా పత్రికలతో పోల్చి చూస్తే ప్రస్తుతం సాక్షి పరిస్థితి అంతోఇంతో మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈనాడు సర్క్యులేషన్ 16 లక్షల నుంచి 12 లక్షలకు తగ్గిపోగా సాక్షి సర్క్యులేషన్ 10.5 లక్షల నుంచి 9.5 లక్షలకు తగ్గింది. ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ 6.6 లక్షల నుంచి ఏకంగా 3.6 లక్షలకు తగ్గడం గమనార్హం. సర్క్యులేషన్ విషయంలో ఈనాడుదే పై చేయి అయినప్పటికీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వేర్వేరుగా 3 నుంచి 4 లక్షల మంది చదివే వాళ్ల సంఖ్య తగ్గితే సాక్షికి మాత్రం కేవలం లక్ష మంది మాత్రమే తగ్గారు.

ఈ విధంగా సాక్షి ఈనాడు, ఆంధ్రజ్యోతిలను తొక్కేసిందనే చెప్పాలి. అదే సమయంలో పలు జిల్లాలలో సర్క్యులేషన్ విషయంలో సాక్షి నంబర్ వన్ స్థానంలో ఉంది. తెలంగాణలో ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకపోవడం ఈ పత్రికకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. సాక్షి మార్కెటింగ్ టీం మరింత దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ఈ పత్రిక సర్క్యులేషన్ మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.