చంద్రబాబు అరెస్ట్ అనంతరం చాలమందిలో వణుకూ దడా మొదలైపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో కోర్టుల కంటే ముందే తీర్పులు ఇచ్చేస్తున్నారు.. విచారణకంటే ముందే విషయాలు ప్రకటించేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు రాజగురువు అనే పేరు సంపాదించుకున్నారని చెప్పే రామోజీరావు తన ఈనాడులో ఈరోజు ఒక ఎడిటోరియల్ రాసుకున్నారు!
చంద్రబాబు అరెస్టుపై “జగన్ పైశాచికానందం” అని పెద్ద ఎడిటోరియల్ రాసుకున్న రామోజీరావు.. సాధారణంగా ఫోర్త్ పేజ్ లో ఉండే ఎడిటోరియల్ ను మొదటిపేజీలో అచ్చేశారు. అయితే మొత్తం ఎడిటోరియల్ చదవితే మాత్రం దానినిండా జగన్ అంటే తనకున్న కసితోపాటు భయం కూడా కనిపిస్తుండటం గమనార్హం.
ఈ ఎడిటోరియల్ లో ఏపీ సీఐడీ, పోలీసులు, లాయర్లు, ఆఖరికి జడ్జి పాత్రకూడా తానే పోషించిన రామోజీరావు… ప్రభుత్వం చెబుతున్న కుంభకోణానికి అసలు తలా తోకా లేదని.. చంద్రబాబు పేరు ఇంతకాలం ఎఫ్ఐఆర్ లో లేనేలేదని.. కుంభకోణానికి పాల్పడ్డారు అనేందుకు ఆధారాలే లేవని రాసుకున్నారు.
దీంతో… తీర్పు ఏమివ్వాలో కూడా రాయాల్సిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇదే సమయంలో… నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉంటు హైబీపీ, షుగర్ తో బాధపడుతున్న 74 ఏళ్ళ వ్యక్తిని పోలీసులు అర్ధరాత్రి అంకమ్మశివాలులాగ అరెస్టు చేయటం ఏమిటంటూ మండిపోయారు రామోజీరావు.
దీంతో… అవినీతికి పాల్పడ్డారని తేలిన తర్వాత, దొంగ దొరికిన తర్వాత ఆయన వయసెంత, ఒంట్లో ఏయే రోగాలు ఉన్నాయనే విషయం పరిగణలోకి తీసుకోవాలా అని అంటున్నారు నెటిజన్లు! దొంగ అని తేలితే… అది 74 ఏళ్ళయినా, 87 ఏళ్ళయినా ఎత్తి లోపలేయడమే కదా అని చెబుతున్నారు.
ఇదే సమయంలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేయటానికి హైబీపీ, షుగర్ అడ్డురావటం లేనప్పుడు, తనను ఏమీ పీకలేరంటూ అసభ్యంగా మాట్లాడటానికి అవి అడ్డుకానప్పుడు.. అవినీతికి పాల్పడటానికి అవి ఆటంకం కానప్పుడు.. ఎత్తి లోపలేయడానికి మాత్రం ఎందుకు అడ్డు అని ప్రశ్నిస్తున్నారు.