ఆంధ్రా బిజెపి ఇన్ చార్జ్ గా వి మురళీధరన్ (బ్రేకింగ్ )

 కాంగ్రెస్ తరహాలోనే భారతీయ జనతా పార్టీ కూడా  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఒక కేరళ నాయకుడిని నియమించింది.

రాష్ట్రంలో బిజెపిని పటిష్టపరిచే బాధ్యతను కేరళ రాజ్యసభ సభ్యుడు వి. మురళీ ధరన్ కు అప్పగించారు.

ఈ మేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీచేశారు.

రెండు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ కేరళ మాజీ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ ఎపి వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే.

మురళీ ధరన్ కూడా బిజెపి లో సీనియర్ నాయకుడే.  

గతంలో కేరళ బిజెపి అధ్యక్షునిగా కూడా పని చేశారు. 

ఏబివిపి, ఆర్.ఎస్.ఎస్ లలో క్రియాశీలకంగా వివిధ హోదాల్లో పనిచేసిన నేపథ్యం ఆయనిది.

ఇక ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ గా సునీల్ దేవ్ధర్ ని నియమించారు.