చంద్రబాబుపై మరోసారి మండిపడ్డ వైసీపీ నేత రోజా

సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓటుకునోటు కేసు వ్యవహారం గుర్తు చేస్తూ చంద్రబాబుకి ఈ కేసులో శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ఆమె విమర్శలు చేసారు. ఆ వివరాలు కింద చదవండి.

చంద్రబాబు తన పొలిటికల్ ఎంట్రీ కాంగ్రే పార్టీ నుండే ఇచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడు అయ్యారు. అయితే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మా గౌరవం కాపాడటానికి ఎన్టీఆర్ టీడీపీ ని స్థాపించారు. అయితే చంద్రబాబు బీజేపీ నుండి విడిపోయాక ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. బిజెపి అభివృద్ధికి అడ్డు పడుతుందని, రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడానికి చంద్రబాబు పూనుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో సంబంధాలు కలుపుకున్నారు. మొదట కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణ వరకే అనుకున్నారంతా… కానీ ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ తో మైత్రి మొదలైంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జనసేన అధినేత సిగ్గు, శరం లేదా అంటూ బహిరంగంగానే నిలదీస్తున్నాయి.

ఇక బిజెపి, వైసీపీ వర్గాలు ఎన్టీఆర్ కు రెండవ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. ఆయన ఆత్మా క్షోభిస్తుంది అంటూ చంద్రబాబును దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత రోజా కూడా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శలు చేసారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడిలో మొదటి నుండి టీడీపీ పైన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. కాగా ఈ కేసులో చంద్రబాబు ప్రధమ ముద్దాయి అంటూ ఆమె ఆరోపించారు.