కష్టాల్లో ఉన్నప్పుడే నందమూరి కుటుంబం గుర్తొస్తుంది.. రోజా సంచలన వ్యాఖ్యలు!

1316509-roja

ప్రముఖ నటి, వైసీపీ నేత రోజా ఇతర పార్టీల నేతలను విమర్శించే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. నారా లోకేశ్ పాదయాత్ర గురించి రోజా మాట్లాడుతూ ఆ పాదయాత్ర ఒక ఫెయిల్యూర్ పాదయాత్ర అని అన్నారు. నారా లోకేశ్ యాత్రను చూసి యువత పారిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. నారా లోకేశ్ పాదయాత్రకు రావడానికి జనాలు భయపడుతున్నారని రోజా చెప్పుకొచ్చారు.

నారా లోకేశ్ పాదయాత్రలో పది మంది కూడా లేరని ఈ పాదయాత్ర ఫెయిల్యూర్ పాదయాత్ర అని ఆమె కామెంట్లు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు నందమూరి కుటుంబం గుర్తుకు రాలేదని రోజా అన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో మాత్రమే నందమూరి కుటుంబం వాళ్లకు గుర్తుకొస్తుందని రోజా చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేశ్ టీడీపీని లాక్కున్న దొంగలు అని ఆమె తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ మనవడిని లోకేశ్ ఆహ్వానించడం దారుణం అని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ వల్ల ఉపయోగం లేదని అర్థమైందని ఈ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను పిలవడం జరుగుతోందని రోజా చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చేలా రోజా కామెంట్లు చేశారు. రోజా కామెంట్లను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

రోజా చేసిన కామెంట్లకు ఇతర పార్టీల నేతల నుంచి ఎలా రియాక్షన్స్ వస్తాయో చూడాల్సి ఉంది. రోజా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నేతల విషయంలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. రోజాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.