వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎప్పటిలానే ఆ వీడియోని పట్టుకుని టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. రామోజి బూతు పురాణం అంటూ ఆ వీడియోని బాగా ప్రచారం చేశారు. దీనిపై మండి పడుతున్నారు రోజా అభిమానులు. ఆమె తిట్టింది మాత్రమే స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఆమె మాట్లాడినదాంట్లో తప్పులు వెతుక్కుంటున్నారు కానీ దాని వెనుక ఉన్న రోజా ఆవేదనను గుర్తించట్లేదని వాపోతున్నారు. గిట్టనివారు ఆమె తిట్టిన క్లిప్పింగు వరకే కట్ చేసి పెట్టారని, మరణించిన వ్యక్తిని చూసి ఆమె కన్నీరు పెట్టుకున్న దృశ్యాలను చూపించలేదని గుర్తు చేస్తున్నారు.
నగరిలో ఆమె చేపట్టిన ఆందోళనలో పోలీసులు లంచాలు తీసుకుని సాక్ష్యాలు కప్పి పుచ్చుతున్నారు అనే విషయాన్ని బూతు పదజాలంతో బయటకి వెలిబుచ్చారు రోజా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఈ విధంగా దుర్భషలాడటం సరి కాదంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఆమె అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం ఆమె మాట్లాడిన తీరునే వేలెత్తి చూపుతున్నారు కానీ తనకి తెలియని ఒక మహిళ కోసం ఆమె పెట్టిన కన్నీరును గమనించట్లేదని వెల్లడించారు.
వేల్ మురుగన్ కి సంబంధించిన టిప్పర్ ఢీ కొని ఒక మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ మొండెం మాత్రమే ఉంది. తల భాగం నుజ్జు నుజ్జు అయింది. ఆ మహిళ శవాన్ని చూసి చలించిన రోజా కంట తడి పెట్టుకుంది. చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలంటూ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు రోజా. పోలీసులు నేరస్థులకు కొమ్ము కాస్తున్నారంటూ ఆమె మండి పడ్డారు. చనిపోయిన మహిళ కుటుంబానికి ఎవరు సమాధానం చెబుతారంటూ ఆవిడ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లలకు దిక్కు ఎవరంటూ పోలీసులను ప్రశ్నించారు. లంచం తీసుకుని మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియాకి సీఐ మల్లిఖార్జునగుప్తా కొమ్ము కాస్తున్నారని, తక్షణమే సదరు పోలీసు మీద చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. మనుషుల ప్రాణాలు తీస్తున్న వేల్ మురుగన్ టిప్పర్లు తిరగకుండా ఆపేయ్యాలంటూ ఆవిడ డిమాండ్ చేసింది. మరణించిన మహిళ ఎస్సీ కాబట్టి నిర్లక్ష్యం గా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల మీద నమ్మకం లేదంటూ, న్యాయం జరిగేవరకు ఆమె అక్కడి నుండి కదలనని చెప్పింది. ఈ దృశ్యాలను కింద ఉన్న వీడియోలో మీరు కూడా చూడవచ్చు.