ఆంధ్రప్రదేశ్ లో రహదారులు సరిగా లేనందున విపక్షాలు తెగ విమర్శలు చేస్తున్నారు. పైగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్లు మరింత దారుణంగా మారాయి. దీంతో ఈ పరిస్థితులపై విమర్శలు రావడంతో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు.
నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని అన్నారు. ఆలూరు నియోజకవర్గం లో దాదాపు 40 రోడ్లు పాడయ్యాయి అని.. వచ్చే నెలలో 2000 కోట్లు వస్తాయని.. అది రాగానే వచ్చే నెల 15 తర్వాత రోడ్ల పనులు పూర్తి చేస్తాము అని అన్నారు. ఇక వచ్చే నెలలో వచ్చే ఆ డబ్బుల గురించి ముఖ్యమంత్రి జగన్ కూడా చెప్పారు అని అన్నారు.