ప్రభుత్వం తన చేతుల్లో వుంది. ప్రత్యేక హోదాపై యువతలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టొచ్చు.. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ప్రజల్నీ చైతన్యవంతుల్ని చేయొచ్చు.. తద్వారా ఖచ్చితగా భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది. సరే, ఆ ఒత్తిడికి కేంద్రం దిగొస్తుందా.? లేదా.? అనేది వేరే చర్చ. ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నెరవేర్చాల్సిన చాలా హామీలున్నాయి. ప్రతి హామీ విషయంలోనూ కేంద్రం పట్టించుకోకుండా వుంటే, ముఖ్యమంత్రి మాత్రం ‘అడుగుతూనే వుంటాం..’ అనడం ఎంతవరకు సబబు.? ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఇంకో ఆప్షన్ లేదన్నది నిర్వివాదాంశం.
కానీ, సమస్యను అడ్రస్ చేసే విధానం ఇలా వుండి వుండకూడదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ కావొచ్చు, దుగరాజపట్నం పోర్టు కావొచ్చు, కడప స్టీలు ప్లాంటు కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. ఏ విషయంలోనూ కేంద్రం, రాష్ట్రానికి సహకరించడంలేదు. శాసన మండలి రద్దు, మూడు రాజధానుల వ్యవహారం.. వీటిపైనా కేంద్రం, రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న వైఖరి అనుమానాస్పదమే. ఏపీ బీజేపీ నేతలు, చాలా కథలు చెబుతున్నారు.. రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నామని. కానీ, బీజేపీ మాటలకీ, చేతలకీ అస్సలు పొంతన వుండడంలేదు.
ఈ పరిస్థితుల్లో బీజేపీకి మేలు చేయడం కోసం అన్నట్టుగా వైఎస్ జగన్ ప్రకటన వుందన్నది కొందరి అభిప్రాయం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే తప్ప, ఆ ప్రభుత్వానికి ఆంధ్రపదేశ్ ఎంపీల అవసరం వస్తే తప్ప.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం కష్టం.. అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలతో ఏపీ బీజేపీ కాస్తంత స్థిమిత పడింది. ఎందుకంటే, తాముండగా కేంద్రంలో వేరే ప్రభుత్వం రాదన్నది బీజేపీ గట్టి నమ్మకం.