చిరంజీవికి రోజా మాస్‌ వార్నింగ్‌… జోస్యం హైలైట్!

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటూ ప్రభుత్వం చిరంజీవి చేసిన కామెంట్స్ చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి ఉన్నఫలంగా ఇలా ఏపీ ప్రభుత్వంపై ఒక్కసారిగా కామెంట్స్ చేయడంతో ఇష్యూ వైరల్ అయ్యింది. దీంతో తమ్ముడితో కలిసి చిరు జనసేనలోకి రాబోతున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ కు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి రోజా చిరంజీవికి సవాల్ చేసారు. ఈ సందర్భంగా గతాన్ని తవ్వుతూ, ఫ్యూచర్ ని జోస్యం చేబుతూ రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో చేసిందేమిటి అని అడుగుతూనే… ఫ్యూచర్ లో కూడా ఛాన్స్ ఉందక్పోవచ్చంటూ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

అవును… చిరంజీవి చేసిన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వ్యాఖ్యలపై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. చిరంజీవి చెబితే వినాల్సిన స్థితిలో జగన్ లేరని సూటిగా తెలిపారు. తమ్ముడు పవన్ కోసం చిరంజీవి మాట్లాడి ఉంటారని.. గతంలో మెగా బ్రదర్స్ కలిసి (ప్రజారాజ్యం + యువరాజ్యం) వస్తేనే ప్రజలు తిరస్కరించారని గుర్తు చేసారు.

ఇదే సమయంలో సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని హితవు పలికిన మంత్రి రోజా… చిరంజీవి సలహాలు ఇవ్వాలి అనుకుంటే ముందు అయన తమ్ముడికి ఇవ్వాలని సూచించారు. అనంతరం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి రాష్ట్రానికి ఏం చేసారని ఈ సందర్భంగా ప్రశ్నించిన రోజా… ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని నిలదీసారు.

అనంతరం… జగన్ మీద నమ్మకం లేకపోతే సినిమా హీరోలు అందరినీ తీసుకొని సీఎం దగ్గరకు ఎందుకు వెళ్లినట్లు అని అని చిరంజీవిని సూటిగా ప్రశ్నించిన రోజా… ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించటం లేదని గుర్తుచేశారు. ఇక ఏపీలో జగన్ పాలన ఎలా ఉందో ప్రతీ గడపకు వెళ్తే తెలుస్తుందని తెలిపారు. అనంతరం చిరంజీవికి సవాల్ విసిరారు రోజా.

జగన్ పాలనపై చర్చకు తాను సిద్దమని.. చిరంజీవి సిద్ధమేనా అని రోజా సవాల్ చేసారు. అదేవిధంగా… రాజ‌కీయాలే చేయాల‌ని అనుకుంటే ఆ రంగంలో వుండి చేయాల‌ని, అలాకాకుండా సినిమాలు చేయాల‌ని అనుకుంటే రాజ‌కీయాల జోలికి రాకుండా వాటినే చేసుకోవాల‌ని రోజా హిత‌వు చెప్పారు. అనంతరం… చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా మరోసారి తిరస్కరణ తప్పదని రోజా జోస్యం చెప్పారు.

ఇలా భూత భవిష్యత్ వర్తమానాలను కలుపుతూ చిరంజీవిపై రోజా ఫైరయ్యారు.

Minister RK Roja Strong Counter to Mega Star Chiranjeevi |@SakshiTV