బ్రేకింగ్ న్యూస్.. రేవంత్ రెడ్డి రాజీనామా

ముందస్తు ఎన్నికల  హడావుడి తెలంగాణలో జోరందుకుంది. మరికొద్ది గంటల్లోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ రెడ్డి గురువారం తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి స్పీకర్ అపాయింట్ మెంట్ అడిగారు. కానీ స్పీకర్ మధుసూధనాచారి అపాయింట్ మెంట్ రేవంత్ రెడ్డి కి దొరకలేదు. దీంతో స్పీకర్ పీఏ కి రాజీనామా లేఖ అందజేసి వెళ్లిపోయారు. రేవంత్ రాజీనామా లేఖ కింద ఉంది చూడండి.

ఉన్నట్టుండి ఇప్పుడే రేవంత్ ఎందుకు రాజీనామా చేశారు. ఇంతకాలం ఎందుకు తాత్సారం చేశారు. ముందస్తు నేపథ్యంలో రేవంత్ రాజీనామా చేయకున్నా అసెంబ్లీ రద్దుకు సీఎం నిర్ణయం తీసుకుంటే ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయేవారే. కానీ రేవంత్ మాత్రం వ్యూహాత్మకంగా అసెంబ్లీ రద్దుకు కొద్ది గంటల ముందే రాజీనామా చేసి చర్చనీయాంశంగా మారారు. రేవంత్ రాజీనామా ఎందుకు.. ఎలా అనే అంశాన్ని పార్ట్ 2 లో చూడండి.