తన పై అక్రమ ప్రసారాలు చేసిన టివి 9, టీ న్యూస్, నమస్తే తెలంగాణ మీడియా సంస్థలకు నోటిసులు ఇస్తానన్నారు. మలేషియా, సింగపూర్, హాంకాంగ్ లలో బ్యాంకు ఖాతాలున్నాయని ప్రసారాలు చేశారు. వారి దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్టు పదే పదే ప్రసారాలు చేసిర్రు.
టివి 9 రామేశ్వర్ రావు, నమస్తే తెలంగాణ కేసీఆర్ కుటుంబం, టి న్యూస్ సంతోష్ రావులు తన రాజకీయ శత్రువులు. కావాలని తప్పుడు ప్రసారాలు చేసిర్రు. తప్పుడు వార్తలు ఆధారాలతో చూపించండి. లేకపోతే 24 గంటల్లో అవి తప్పు అని బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే కోర్టులల్లోనే తేల్చుకుందాం అని రేవంత్ అన్నారు.
అక్టోబర్ 3 వతేదిన ఐటి విచారణ జరిగినప్పుడు అధికారులు ఈ మీడియా సంస్థలలో వచ్చిన ఆధారంగా తనను 4,5 గంటలపాటు వేధించారని రేవంత్ అన్నారు. అప్పుడు తాను మీ దగ్గర ఉన్న ఆధారాలేంటని ప్రశ్నిస్తే ఈ మీడియాలలో వచ్చినయి నువ్వు సమాధానం చెప్పాలని అధికారులు తనను వేధించారని రేవంత్ అన్నారు.
దీంతో తనకు రూపాయి అకౌంట్ లేదు ఉంటే తీసుకోండయ్యా అని సమాధానమిచ్చానన్నారు. టివి9, నమస్తే తెలంగాణ, టి న్యూస్ జాగ్రత్తగా ఉండాలి. మిగతా పాత్రికేయులు కూడా ఆలోచించి నిజం అనుకున్నాకనే ప్రసారం చేయాలి. లేకుంటే పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. ఆ మూడు సంస్థలు క్షమాపణ చెప్పాలి లేకపోతే నోటిసులు పంపి కోర్టులో తేల్చుకుంటానన్నారు. మీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే ప్రసారం చేయండి, నిలదీయండి సమాధానం ఇస్తాం కానీ ఇలా సగం సగం సమాచారంతో రాసి రాజకీయ భవిష్యత్తుతో ఆడుకోవద్దన్నారు.
ఏ పేపర్లల్లో, టివిలల్లో తన గురించి తప్పుుడు ప్రచారం చేశారో అదే స్థానంలో తెలంగాణ సమాజం ముందు తనకు బహిరంగ క్షమాపణ 24 గంటలల్లో చెప్పాలన్నారు. లేని పక్షంలో తాను నేరుగా కోర్టులో తేల్చుకుంటానన్నారు.