ఓవర చేస్తే ఇలాగే ఉంటుంది ఫలితం

ఆయన కష్టపడి ఐపిఎస్ సాధించారు. పోలీసు శాఖలో అందరూ కలలుగనే అత్యున్నత పోస్టయిన డిజిపిగా నియమితులయ్యారు. కానీ ఏం లాభం నిబంధనల ప్రకారం నడుచుకోకుండా ఓ పార్టీకి, వ్యక్తికి మద్దతుగా నిలబడ్డారు. దాని ఫలితమే ఇపుడు అప్రధాన్య పోస్టుకు బదిలీ అయ్యారు. ఇంతకీ ఆయనెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

అవును ఆయనే డిజిపిగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్. తన అనుభవం మొత్తాన్ని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయటానికి ఉపయోగించాల్సిన ఠాకూర్ కేవలం చంద్రబాబునాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించటానికి మాత్రమే ఉపయోగించారు. ఠాకూర్ డిజిపిగా ఉన్నంత కాలం వైసిపి నేతలను పోలీసులు ఏ విధంగా వేధించారో అందరికీ తెలీసిందే.

ఠాకూర్ వ్యవహారశైలి వల్లే చంద్రబాబు మద్దతుదారునిగా, టిడిపి సీనియర్ నేతగా వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు ఆరోపించారంటేనే అర్ధమవుతోంది వ్యవహారం. అలాంటిది  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఠాకూర్ ను ప్రింటింగ్  అంగ్ స్టేషనరీ విభాగానికి బదిలీ చేశారు.

ఆయన స్ధానంలో ఫుల్ అడిషినల్ చార్జిని గౌతమ్ సవాంగ్ కు అప్పగించారు. డిజిపిగా రిటైర్ కావాల్సిన ఠాకూర్ చివరకు ఎవరికీ పట్టని విభాగానికి బదిలీ అయ్యారు. ఒక్క ఠాకూరే కాదు చంద్రబాబును చూసుకుని ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందనటానికి ఠాకూర్ ఉదంతమే తాజా నిదర్శనం.