రాష్ట్ర చరిత్రలో ఇదే ఫస్ట్ టైం… జగన్ ఖాతాలో మరో రికార్డ్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ ఖాతాలో మరో సక్సెస్ వచ్చి చేరింది. పైగా ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం కావడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఫలితంగా.. ప్రత్యర్థుల ఊకదంపుడు విమర్శలకు జగన్ చేతలతో మాత్రమే సమాధానాలు చెబుతూ, తనకు ఓటు వేయమని పరోక్షంగా చెబుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో.. ఇది జగన్ మార్కు పాలన అంటూ పోస్టులు పెడుతున్నారు వైసీపీ శ్రేణులు.

ఇప్పటికే సంక్షేమం విషయంలో ఆల్ మోస్ట్ అన్ని హామీలను నెరవేర్చినట్లు ఏపీ సర్కార్ చెబుతుంది. అందుకు సంబంధించిన రికార్డులను ప్రజల ముందుంచుతుంది. దీంతో… సుమారు 98శాతం హామీలను మొదటి నాలుగున్నరేళ్లలోపే నెరవేర్చిన పార్టీగా వైఎస్సార్ సీపీ రికార్డ్ సృష్టించిదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల వేళ జగన్ ఇచ్చిన మరో హామీ కూడా తాజాగా నెరవేరిపోయింది. అది కూడా రికార్డ్ స్థాయిలో.

అవును.. 2019 ఎన్నికల సమయంలో ప్రతీ పార్లమెంట్ నియోకవర్గంలో ఒక వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని నాడు జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో… ఈ విద్యా సంవత్సరం (2023-24) ఐదు కళాశాలల్లో 750 ఎంబీబీఎస్‌ సీట్లలో ప్రవేశాలకు “నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌” అనుమతి ఇచ్చింది.

వీటిలో అల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లును కేటాయించగా మిగిలిన 85 శాతం సీట్లను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పొందనున్నారు. ఇలా… ఒకే ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభం అవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి!

ఇక రాష్ట్రంలో మెడికల్ కాలేజీల చరిత్రను ఒకసారి చూస్తే… రాష్ట్రంలో మొట్టమొదటగా 1923లో విశాఖపట్నంలో ఆంధ్ర వైద్య కళాశాల ఏర్పాటైంది. నాటి నుంచి నుంచి 2019కి అంటే 96 ఏళ్లలో జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికంటే ముందు వరకూ 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య విద్యపై మరింత శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా సుమారు రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు.

అయితే 17 కొత్త వైద్య కళాశాలల్లోనూ ఐదు కలాశాలల్లో తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇదే సమయంలో కొత్త మెడికల్ కాలేజీలను నిరంఇంచడంతోపాటు… ఇప్పటికే ఉన్న కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది ఏపీ సర్కార్. ఫలితంగా మరో 627 పీజీ సీట్లు పెరగనున్నాయని తెలుస్తుంది.