జగన్ కుప్పంను టార్గెట్ చేయడంలో అసలు ట్విస్ట్ ఇదేనా.. బాబు తప్పు చేస్తారా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలు అస్త్రంగా పాలన సాగిస్తుండటం గమనార్హం. కులం, మతంతో సంబంధం లేకుండా జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సీఎం జగన్ కుప్పం వైసీపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారు. అయితే చంద్రబాబు నాయుడు తమ పార్టీని బీసీల పార్టీగా చెప్పుకుంటారనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ సైతం బీసీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చారు.

అయితే కుప్పంలో బీసీల జనాభా ఎక్కువ అనే సంగతి తెలిసిందే. జగన్ కుప్పంలో బీసీ అభ్యర్థికి సీటు ఇవ్వడం ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి పెంచాలని జగన్ అనుకుంటున్నారని సమాచారం అందుతోంది. జగన్ 2024 ఎన్నికల్లో సైతం బీసీ అభ్యర్థులకు ఎక్కువగా సీట్లు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. చంద్రబాబు కూడా అదే స్థాయిలో బీసీలకు సీట్లు ఇవ్వకపోతే టీడీపీకే నష్టం జరుగుతుంది.

అదే సమయంలో కుప్పంలో వైసీపీ టీడీపీని ఓడిస్తుందంటూ చేస్తున్న ప్రచారం వల్ల చంద్రబాబును, టీడీపీ నేతలను జగన్ తెగ టెన్షన్ పెడుతున్నారు. చంద్రబాబు కుప్పంపై దృష్టి పెట్టి ఇతర నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది టీడీపీనే అని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న వైసీపీ ఈ స్థాయిలో సీట్లు ఇస్తూ చంద్రబాబు షాక్ ఇవ్వడంతో పాటు చంద్రబాబును తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

బాబు కుప్పంలో గెలవడంపై దృష్టి పెట్టి ఇతర నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఫలితాలు మరో విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి టీడీపీకి మరో భారీ షాక్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు. జగన్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇవ్వాలని ఫిక్స్ కావడంతో 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అని ప్రజల మధ్య చర్చ జరుగుతోంది.