ఆ రీజన్ వల్లే జగన్ షర్మిల మధ్య గొడవలు.. కొండా సురేఖ కామెంట్లు నిజమేనా?

జగన్ షర్మిల మధ్య గొడవలకు సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. జగన్ షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉన్నాయని కొంతమంది కామెంట్లు చేస్తుండగా పొలిటికల్ రీజన్స్ తో జగన్ షర్మిల మధ్య విభేదాలు వచ్చాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొండా సురేఖ మాట్లాడుతూ జగన్ షర్మిల మధ్య విభేదాల గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

తెలంగాణలో వైసీపీని కొనసాగించాలని మేము కోరినా ఒప్పుకోలేదమని కొండా సురేఖ అన్నారు. షర్మిల గతంలోనే పార్టీ పెట్టి ఉంటే బాగుండేదని కొండా సురేఖ తెలిపారు. ఏపీ సీఎం సీటు విషయంలో జగన్ షర్మిల మధ్య గొడవలు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. విజయమ్మ సపోర్ట్ కూడా షర్మిలకే ఉందని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు.

కాంగ్రెస్ ఆశయాలు వైఎస్సార్ ఆశయాలు అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక తండ్రిగా వైఎస్సార్ గురించి షర్మిల చెప్పుకోవచ్చని ఆమె అన్నారు. కేసీఆర్ నమ్మించి మోసం చేశారని కొండా సురేఖ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లకు కాంగ్రెస్ ను తిట్టే హక్కు ఎక్కడిదని కొండా సురేఖ అన్నారు. జగన్ షర్మిల గురించి కొండా సురేఖ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ కామెంట్ల గురించి జగన్ లేదా షర్మిల స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

షర్మిల, జగన్ విభేదాలు కూడా రాబోయే రోజుల్లో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయ నేతలు ప్రతి సందర్భంలో షర్మిలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. షర్మిల కూడా కేసీఆర్ మినహా మరెవరిపై విమర్శలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. రాబోయే రోజుల్లో అయినా జగన్ షర్మిల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయేమో చూడాలి.